లిక్క‌ర్ స్కామ్…కంచికి చేరని  క‌థ‌!

“ఈ స్క్రిప్ట్ ల‌ను సీబీఐ, ఈడీల కేంద్ర కార్యాల యాలున్న రాజ‌ధానీ న‌గ‌రాన్ని ఆనుకొని ప్ర‌వ‌హిస్తున్న య‌మునాన‌ది మురికి నీటిలో క‌రిగిపోయే వ‌ర‌కు ముంచి ఉంచడం  త‌ప్ప మ‌రోమార్గం లేదు. ఒకానొక రోజున ఈ ద‌ర్యాప్తు సంస్థ‌లు ఫ‌లానా ముఖ్య‌నాయ‌కుడికి వ్య‌తిరేకంగా గొంతు చించుకుంటాయి. త‌ర్వాత ఈ కేసు మొత్తం విష‌పూరితంగా మారిపోయి చివ‌ర‌కు అదృశ్య‌మైపోతుంది. దిల్లీ లిక్క‌ర్ స్కామ్‌పై సీబీఐ ర‌చించిన పురాణం దీనికి గొప్ప ఉదాహ‌ర‌ణ‌. ఇది భారీ కుట్ర‌, కుంభ‌కోణం నుంచి మొద‌లై వేలాది పేజీల చార్జ్‌షీటు దాఖలు అక్క‌డినుంచి 600 పేజీల కోర్టు తీర్పు వ‌ర‌కు కొన‌సాగిం ది. ఇంతా చేస్తే కోర్టు స‌రైన ఆధారాలు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదంటూ అంద‌రికీ క్లీన్ చీట్ ఇవ్వ‌డం, మురికి నీటిలో ఒక స్వ‌చ్ఛ‌మైన నీటిజాడ వంటిది. “
 అన్నీ కంచికి చేరే  క‌థ‌లే అనేది ఒక తెలుగు సామెత‌. కానీ సీబీఐ లేదా ఈడీలు రాజ‌కీయ నాట‌కాలకోసం రాసే స్క్రిప్ట్ ల‌కు (అంటే వారు చేసే కేసుల ఫైలింగ్, చార్జ్ షీటు దాఖ‌లు) అంతం అనేది ఉండదు . అవి అంతులేని వింత‌క‌థ మాదిరిగా కొన‌సాగుతూనే ఉంటాయి .  ఈ స్క్రిప్ట్ ల‌ను సీబీఐ, ఈడీల కేంద్ర కార్యాల యాలున్న రాజ‌ధానీ న‌గ‌రాన్ని ఆనుకొని ప్ర‌వ‌హిస్తున్న య‌మునాన‌ది మురికి నీటిలో క‌రిగిపోయే వ‌ర‌కు ముంచి ఉంచడం  త‌ప్ప మ‌రోమార్గం లేదు. ఒకానొక రోజున ఈ ద‌ర్యాప్తు సంస్థ‌లు ఫ‌లానా ముఖ్య‌నాయ‌కుడికి వ్య‌తిరేకంగా గొంతు చించుకుంటాయి. త‌ర్వాత ఈ కేసు మొత్తం విష‌పూరితంగా మారిపోయి చివ‌ర‌కు అదృశ్య‌మైపోతుంది. దిల్లీ లిక్క‌ర్ స్కామ్‌పై సీబీఐ ర‌చించిన పురాణం దీనికి గొప్ప ఉదాహ‌ర‌ణ‌. ఇది భారీ కుట్ర‌, కుంభ‌కోణం నుంచి మొద‌లై వేలాది పేజీల చార్జ్‌షీటు దాఖలు అక్క‌డినుంచి 600 పేజీల కోర్టు తీర్పు వ‌ర‌కు కొన‌సాగిం ది. ఇంతా చేస్తే కోర్టు స‌రైన ఆధారాలు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదంటూ అంద‌రికీ క్లీన్ చీట్ ఇవ్వ‌డం, మురికి నీటిలో ఒక స్వ‌చ్ఛ‌మైన నీటిజాడ వంటిది. ఇక్క‌డ కుంభ‌కోణానికి సంబంధించిన అంశం ఒక్క‌టే లిక్క‌ర్‌! ఎప్పుడైతే ‘ఆరోప‌ణ‌ల భూతాలు’ నీటిని తాకాయో ఒక్క‌సారి బ‌ల‌హీన‌ప‌డిపోయాయి. దిల్లీ లిక్క‌ర్ స్కాం అనేది ప్రాథ‌మికంగా ఒక రాజ‌కీయ స‌మాంత‌ర‌త‌లకు చెందిన ఒక స్క్రిప్ట్. ఇందులో ‘బాధితుడు’ మాత్ర‌మే నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతాడు. సినిమాల్లో మాదిరిగా సీబీఐ విచార‌ణ గొప్ప ప్ర‌తిపాద‌న‌తో, అమలు చాలా భ‌యంక‌రంగా ఉంటుంది .
అధికార దుర్వినియోగం, త‌ప్పుడు ప్ర‌వ‌ర్త‌న‌, అవినీతి వంటి గంభీర‌మైన ప‌దాల‌తో గొప్ప సినిమానే సీబీఐ చూపింది. ఇందులో అన్నీ స‌ర‌ళ‌మైన పాత్ర‌లు, గ‌జిబిజి రాత‌లు, నాసిర‌క మైన ప్రొడ‌క్ష‌న్ తో మొత్తం తేలిపోవ‌డం త‌ప్ప మ‌రేం ఉండదు . ఈ విచార‌ణ మొత్తాన్ని మీడియా క‌థ‌నాలు, నాట‌కీయ ఆరోప‌ణ‌లతో ఈ కేసుకు విప‌రీత‌మైన హైప్ క‌లిగించినా చివ‌ర‌కు కోర్టు తీర్పుతో, ఇదొక ఎటువంటి ప‌స‌లేని క‌థ‌నంగా మిగిలిపోయింది. కుళ్లిపోయిన టొమాటాల మాదిరిగా దుర్గంధం వెద‌జ‌ల్లుతున్న ఈ కేసులో ఎటువంటి సాక్ష్యాధారాలు, కుట్ర వంటివి లేవ‌ని తీర్పు చెప్ప‌డం ద్వారా కోర్టు త‌ప్పు ప‌ట్టింది.  మొత్తం స్కాం వ్య‌వ‌హారం ఒక ఆస‌క్తిలేని క‌థ‌గా ఈ తీర్పు తేల్చేసింది. ఆవిధంగా ఇదొక మొద‌టి ట్రైల‌ర్ కూడా దాట‌ని ప‌స‌లేని క‌థ‌గా మిగిలిపో యింది. సీబీఐ స్క్రీన్ ప్లే ‘జీరో స్టార్’ రివ్యూగా పేర్కొన్న‌ట్ల‌యింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ చూపిన సాక్ష్యాలేవీ  ప్రాథ‌మికంగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకునేవిగా లేవ‌ని న్యాయ‌మూర్తి స్ప‌ష్టంగా పేర్కొన్నారు. న్యాయ ప‌రిభాష‌లో చెప్పాలంటే సీబీఐ ఈ కేసువిష‌యంలో ప‌నిచేసిందేమీ లేద‌ని చెప్పాలి. అసలు ఈ కేసులో ఏదో నిగూఢ‌మైన మోసం దాగివుంద‌ని చెప్ప‌డానికీ లేదు. కేవ‌లం పెద్ద ఎత్తున కుట్ర త‌ప్ప మ‌రేం లేదు. ఈ నేప‌థ్యంలో కోర్టు సీబీఐ ఛార్జ్ షీటును చెత్త‌బుట్ట‌లో ప‌డేయడంతో కేసు విశ్వ‌స‌నీయ‌త పూర్తిగా దెబ్బ‌తిన్న‌ది. ఈ శ‌తాబ్దంలోనే అతిపెద్ద నేరం స్థాయిలో ప్ర‌చార‌మైన ఈ కేసు చివ‌ర‌కు ప‌ద‌వ‌త‌ర‌గ‌తి స్థాయిలో కూడా చ‌ర్చించ‌డానికి త‌గ‌నిద‌నేది సుస్ప‌ష్ట‌మైంది.
మ‌రి సీబీఐ లేదా ఈడీలు ఈ ‘బ్లాక్ బ‌స్ట‌ర్’ కేసు కోర్టులో అట్ట‌ర్ ఫ్లాప్ అయింద‌న్న సంగ‌తి ఒప్పుకున్నాయ నుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్టే.  తీర్పు వ‌చ్చిన త‌ర్వాత తాము ఏం చేయాలో అవే చేశాయి. ఒక్క‌సారిగా మీడియాలో ఆధిప‌త్యాన్ని కొన‌సాగించి, విప‌క్షాల‌ను ప‌రుగులు పెట్టించ‌డానికే య‌త్నించాయి. ఈ మొత్తం షోను చూస్తున్న అధికార ప‌క్షం ఆనందిస్తోంది. ఈ కేసులో విజ‌యం సాధించాల‌న్న ఉద్దేశం ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు ఏకోశానా లేదు. ఈ విచార‌ణ‌ను ఆస్కార్ అవార్డు గెలుచుకునే స్థాయిలో జ‌ర‌పాల‌న్న ఉద్దేశం విచార‌ణ సంస్థ‌ల‌కు ఎంత‌మాత్రం లేద‌ని, రాబోయే దిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార ప‌క్షం ఆధిప‌త్యాన్ని కొన‌సాగించ‌డానికే, ఈ కేసును సాగ‌దీయ‌డం ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని, విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. కేసులో ఎన్న‌యినా లొసుగులు ఉండనీ  గాక‌, ‘పొలిటిక‌ల్ బాక్సాఫీస్‌’లో మాత్రం అనుకున్న ఫ‌లితాలు రావాలి! అంతే! తెర‌వెనుక కేంద్రంలోని అధికార‌పార్టీ మొత్తం ఎపిసోడ్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించింద‌నేది కోర్టు తీర్పు బ‌హిర్గ‌తం చేసింది. ఈ మొత్తం కేసు న‌డిచిన విధానం గ‌మ‌నిస్తే ఒక్క స‌త్యం బోధ‌ప‌డుతుంది.
అదే శీల హ‌న‌నం! కోర్టు తీర్పును గ‌మ‌నిస్తే, సీబీఐ లేదా ఈడీలు కేసును ద‌ర్యాప్తు చేసిన‌ట్లు క‌న‌బ‌డ‌టం లేదు. కేవ‌లం అధికార‌పార్టీ నేత‌ల రాజ‌కీయ నైపుణ్యానికి అనుగుణంగా న‌డుచుకున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. విప‌క్ష నేత‌ల‌ను అరెస్ట్ చేయ‌డం, వారి ప‌లుకుబ‌డిని దెబ్బ‌తీయ‌డం వీటి ప్ర‌ధాన ల‌క్ష్యంగా క‌న‌బ‌డుతున్న‌ది. కోర్టు ఆదేశాల‌ను చూసిన సామాన్యుడు, ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను కీలుబొమ్మ‌లుగా ఉప‌యోగించుకుంటూ అధికార పార్టీ ఒక డ‌ర్టీ గేమ్‌ను ఆడుతున్న వైనాన్ని తేలిగ్గా ప‌సిక‌ట్టేస్తాడు. కేసుకు సంబంధించిన సాక్ష్యాలు క‌నిపించ‌క‌పోవ‌చ్చు, కానీ అధికార పార్టీ రాజ‌కీయ దురుద్దేశాలు సుస్ప ష్టంగా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు దృశ్య‌మాన‌మ‌వుతున్నాయి.
ఇక తాము ప‌డిన క‌ష్టాన్ని కోర్టు గుర్తించ‌లేద‌ని సీబీఐ వాపోవ‌డ‌మే కాదు, దిల్లీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం త‌మ సృజ‌నాత్మ‌క ర‌చ‌నా సామ‌ర్థ్యాన్ని మ‌రోసారి ప్ర‌ద‌ర్శించడానికి మాత్ర‌మే న‌నుకోవాలి. కానీ ట్రైల్ కోర్టు ఈ కేసులో ఎంత‌మాత్రం ప‌స‌లేద‌న్న సంగ‌తిని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది. ఓలింపిక్స్ క్రీడ‌ల్లో జంపింగ్ పోటీల ప్ర‌ద‌ర్శ‌న కంటే ఈ కేసులో క‌ప్ప‌దాట్లు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న సంగ‌తిని నిగ్గుతేల్చింది.  మొత్తంమీద చెప్పాలంటే ఈ కేసు విచార‌ణ కంటే, అధికార పార్టీకి అనుకూలంగా ప‌నిచేయ‌డ‌మే ముఖ్య మ‌న్న సంగ‌తిని మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. వీరు హైకోర్టుకు వెళ్లినా అక్క‌డ కూడా పెద్ద‌గా ఒర‌గ‌బెట్టేదేమీ ఉండదు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *