మద్యం విక్రయాలకు దసరా కిక్కు

– పండగతో భారీగా అమ్మకాలు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 3: తెలంగాణలో మద్యం విక్రయాలు దసరా కిక్కు ఇచ్చాయి. అక్టోబర్‌ 2న దసరా రావడంతో (గాంధీ జ‌యంతి కూడా అవ‌డంతో ఆరోజు మ‌ద్యం అమ్మ‌కాలు నిషేధం) ముందస్తుగానే సెప్టెంబరు 30, అక్టోబర్‌ 1 తేదీల్లో భారీగా మద్యం అమ్మ‌కాలు జరిగాయి. ఈ ఏడాది సెప్టెంబరులోనే రూ.3,046 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబరు 29న రూ.278 కోట్లు, 30న రూ.333 కోట్లు, అక్టోబర్‌ 1న రూ.86.23 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ మూడు రోజుల్లోనే 60 నుంచి 80శాతం వరకు అమ్మకాలు పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 29.92 లక్షల కేసుల లిక్కర్‌, 36.46 లక్షల కేసుల బీర్లు విక్రయాలు జ‌రిగాయి. గతేడాదితో పోలిస్తే 7శాతానికిపైగా విక్రయాలు పెరిగాయి. మద్యం సేల్స్‌ పెరగడంతో ఎక్సైజ్‌ శాఖకు రాబడి పెరిగింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *