- స్టే ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ
– కిడ్పాపైన కౌన్సిలర్ యాదగిరి హాజరు
– స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్న కోర్టు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్ అయ్యింది. మున్సిపల్ ఎన్నికపై గతంలో ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేసింది. ఈసీ, కలెక్టర్ తుది నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఎన్నికపై రెండు రోజుల క్రితమే స్టే విధించగా దాన్ని ఎత్తివేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇబ్రహీంపట్నం 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి మిస్సింగ్‌పై కుటుంబ సభ్యులు హైకోర్టులోహెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరగగా యాదగిరిని కోర్టు ముందు ఇబ్రహీపట్నం పోలీసులు హాజరుపర్చారు. అతడి స్టేట్‌మెంట్‌ను న్యాయస్థానం రికార్డ్ చేసింది. బీఆర్‌ఎస్ నేతలు తనను బలవంతంగా చీరాలకు తీసుకెళ్లి రిసార్ట్‌లో బంధించారని, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు దాదాపు 12 గంటలపాటు హైదరాబాద్ మొత్తం తిప్పి చీరాలకు తీసుకెళ్లారని యాదగిరి స్టేట్‌మెంట్ ఇచ్చారు. హైకోర్టు ఉత్తర్వులతో నిన్న కౌన్సిల్ మీటింగ్‌కు హాజరైనట్లు ఆకుల యాదగిరి కోర్టుకు తెలియజేశారు. అతని స్టేట్‌మెంట్ పూర్తి అయిన తర్వాత హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు క్యాంపు పేరుతో తన భర్తను కిడ్నాప్ చేశారని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో యాదగిరి భార్య వసంత ఫిర్యాదు చేశారు. దీంతో యాదగిరి మిస్సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 363 కింద కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇబ్రహీంపట్నం బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అతని తనయుడు ప్రశాంత్ రెడ్డిపై యాదగిరి భార్య అనుమానాలు వ్యక్తం చేశారు. స్టే ఎత్తివేయడంతో ఇక ఎన్నికకు లైన్ క్లియర్ అయ్యింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





