హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చంద్రయ్య పల్లి గ్రామంలో పిడుగు పడి యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో తన తల్లిదండ్రులతో కలిసి పని చేస్తున్న క్రమంలో యువకుడు మొద్దు రాకేష్ ముదిరాజ్ (25) పై పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. చేతికందివచ్చిన కొడుకు కళ్ళేదుటే పిడుగుపాటుకు మృతిచెందడంతో కుటుంబమంతా శోకసముద్రంలో మునిగిపోయింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





