– ప్రారంభానికి సిద్ధంగా జకోరా, చందూర్, చిన్తకుంట ఎత్తిపోతలు
-మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని జకోరా, చందూర్, చింతకుంట ఎత్తిపోతల పథకాలు పూర్తి కావస్తున్నాయని, త్వరలో వీటిని ప్రారంభించనున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. త్వరితగతిన ఈ పథకాలు పూర్తి కావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. రూ.106.04 కోట్లతో చేపట్టిన ఈ పథకాలతో నిజామాబాద్ జిల్లాలోని వర్ని, చందూర్, మొస్రా మండలాల పరిధిలోని 7,975 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని ఆయన తెలిపారు. వచ్చే ఖరీఫ్ నాటికి సాగు నీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించినటు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పనులు వేగవంతం చేసినట్లు చెప్పారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ నుండి జకోరా, చందూర్, చింతకుంట ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి పంపిణీ ఉంటుందని ఆయన వివరించారు. ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన పంప్ హౌస్‌లకు 2.93 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉంటుందని, తద్వారా నీటి పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ ఎత్తిపోతల పథకాలతో ఇప్పటికే ఉన్న ఆయకట్టును స్టీరికరించడంతోపాటు అదనంగా కొత్త ఆయకట్టుకు నీరు అందించడం, చెరువులు, కుంటలు నింపి భూగర్భ జలాలను పెంపొందించడం అన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. ఇప్పటికే ఈ పథóŠకాలను ట్రయల్ రన్ నిర్వహించినట్లు తెలిపారు. ఇవి ప్రారంభమైతతే ధాన్యం దిగుబడి విశేష రీతిలో పెరగడంతోపాటు, పంటల భద్రత ఇనుమడింప చేస్తుందన్నారు. రైతుల అభ్యున్నతికి సాగునీటి విస్తరణకు కాంగ్రెస్ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తున్నదని, త్వరలోనే ఈ పథకాలను రైతులకు అంకితం చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రకటించారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





