వ్యక్తి మానసిక వికాసానికి గ్రంథాయాలు కీలకం

– కిట్స్‌ వరంగల్‌ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కోమల్‌రెడ్డి
– కళాశాలలో గ్రంథాలయాల వారోత్సవాలు ప్రారంభం

వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: సమాజ అభివృద్ధికి, వ్యక్తి మానసిక వికాసానికి గ్రంథాలయాలు కీలకమైనవని కిట్స్‌ కళాశాల రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం.కోమల్‌ రెడ్డి పేర్కొన్నారు. పుస్తకాలే జ్ఞానానికి ఆధారం అని విద్యార్థులు రోజూ గ్రంథాలయాన్ని వినియోగించుకుని తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. .జ్ఞానాన్ని విస్తరించే కేంద్రాలుగా గ్రంథాలయాలు విద్యార్థులకు, పరిశోధకులకు, పాఠకులకు మార్గదర్శకాలని తెలిపారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కిట్స్‌ వరంగల్‌ కళాశాలలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి 20వ తేదీ వరకు కిట్స్‌ వరంగల్‌ కళాశాల గ్రంథాలయంలో వారోత్సవాలు నిర్వహించనున్నారు. గ్రంథాలయ వారోత్సవాల ఉద్దేశం ప్రజలలో పఠనాభిరుచిని పెంపొందించడమేనన్నారు. అకాడమిక్‌ డీన్‌ డాక్టర్‌ కె.వేణుమాధవ్‌ మాట్లాడుతూ నేటి విద్యార్థుల్లో సమాచార సేకరణ సామర్థ్యాన్ని పెంపొందించడంలో గ్రంథాలయాల పాత్ర అత్యంత ముఖ్యమని తెలిపారు. పుస్తకం చదవడంతోపాటు డిజిటల్‌ వనరులను వినియోగించుకోవడం ద్వారా విద్యార్ధులు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. కళాశాల లైబ్రేరియన్‌ డాక్టర్‌ కోమల్ల ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా కళాశాల గ్రంథాలయంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో పుస్తక ప్రదర్శనలు, పఠన పోటీలు, వ్యాసరచన, క్విజ్‌ పోటీలు నిర్వహించి విద్యార్థుల్లో పఠనాభిరుచిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. నేటి డిజిటల్‌ యుగంలో పుస్తకాల విలువలను గుర్తు చేస్తూ గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలియజేయడమే జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముఖ్య ఉద్దేశంమన్నారు. అనంతరం లైబ్రరీ సమాచార బ్రోచర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు డాక్టర్‌ ఎం.వీరారెడ్డి, డాక్టర్‌ వి.రాజగోపాల్‌, డాక్టర్‌ ఎం.శ్రీలత, డాక్టర్‌ సి.వెంకటేష్‌, డాక్టర్‌ యు.శ్రీనివాస్‌, బాలరాజు, లైబ్రరీ కమిటీ సభ్యులు, గ్రంథాలయ సిబ్బంది డాక్టర్‌ ఎం. నిరంజన్‌, డాక్టర్‌ ఎం.అరుణ్‌ కుమార్‌, టి.రాజు, సిహెచ్‌.ప్రకాష్‌, విద్యార్థినీవిద్యార్థులు, అధ్యాపకులు, కళాశాల ప్రజా సంబంధాల అధికారి డాక్టర్‌ డి.ప్రభాకరాచారి పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page