విమోచనపై మాట మార్చిన నేతలు

– తెలంగాణ చరిత్రపై వక్రభాష్యం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16: సెప్టెంబర్‌ 17ను విమోచన దినంగా జరుపుకోవడం తెలంగాణ సాయుధ పోరాటాన్ని గౌరవించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచంద్రర్‌రావు అన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో విమోనోత్సవాలు జరపాలని డిమాండ్‌ చేసిన వారు అధికారంలోకి రాగానే మాట మార్చడం తెలంగాణ ప్రజలను అవమానించడం తప్ప మరోటి కాదని అన్నారు. అధికారంలోకి రాగానే విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్న సీఎం కేసీఆర్‌ మజ్లిస్‌ పార్టీకి భయపడి మాట మార్చార, ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా ఆయన దారిలోనే నడుస్తోందని విమర్శించారు. ఇలాంటి చర్యలను బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. రజాకార్ల ఆకృత్యాల గురించి నేటి తరానికి తెలియాల్సి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు గడిచినా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు పాలకులు ఇష్టపడటం లేదన్నారు. ఇతర పార్టీలు కూడా విమోచన దినాన్ని జరుపుకునే విషయంలో అర్థంలేని ప్రకటనలు చేస్తున్నాయన్నారు. నిజాంకు వ్యతిరేకంగా చాలామంది ముస్లింలు కూడా పోరాడారని, నిజాంకు కంటివిూద కునుకు లేకుండా చేసిన షోయబుల్లాఖాన్‌ను రజాకార్లే క్రూరాతిక్రూరంగా చంపించిన సంగతిని మనం గుర్తుచేసుకోవాలన్నారు. విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా కుల, మతాలకతీతంగా నిజాం, రజాకార్లపై పోరాటం చేసిన వీరులందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని రామచంద్రరావు అన్నారు. వీరందరి కృషి కారణంగానే తెలంగాణ భారత దేశంలో విలీనమై మన గడ్డ మీద తివ్రర్ణ పతాకం ఎగిరిందని గుర్తు చేశారు. మనకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు లభించాయన్నారు. ఇప్పటికైనా బానిసత్వపు ఆలోచనలను విడనాడి వాస్తవ చరిత్రను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో ముందుకు కదలాలని రామచందర్‌రావు పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *