హౌజ్ కమిటీల ఊసే లేదు

– డిప్యూటీ స్పీక‌ర్ నియామ‌కం లేదు
– ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు లేవు
– స్పీక‌ర్‌కు హ‌రీష్‌రావు లేఖ‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 7:  రెండేళ్లు గడిచినా హౌస్ కమిటీల ఊసే లేదు.. డిప్యూటీ స్పీకర్ నియామకంపై స్పందన లేదు సుప్రీంకోర్టు హెచ్చరించినా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు శూన్యం రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోవడం నిబంధనల ఉల్లంఘన కాక మ‌రేంట‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావు అసెబ్లీ స్పీక‌ర్‌కు బ‌హిరంగ లేఖ రాశారు. సభను తరచుగా వాయిదా వేస్తూ రూల్ 13, 16 లను తుంగలో తొక్కుతున్నారు. క్వశ్చన్ అవర్, జీరో అవర్ ను కుదిస్తూ సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. డిప్యూటీ స్పీకర్ లేకపోవడంతో ప్రివిలేజ్ కమిటీ పూర్తిగా నిర్వీర్యమ‌వుతున్నాయ‌న్నారు.  ఎస్టిమేట్స్ కమిటీ ఛైర్మన్ రాజీనామా చేసినా.. కమిటీని పునరుద్ధరించకపోవడంలో ఆంత‌ర్య‌మేంట‌ని ప్ర‌శ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2) ను ఉల్లంఘిస్తూ అనర్హత వేటుపై కాలయాపన చేస్తున్నారు. ఏడాదికి కనీసం 30 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాల‌నిహరీష్ రావు డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై వెంటనే నిర్ణయం తీసుకోవాల‌ని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *