కులం పేరుతో, మతం పేరుతో నిజమైన జాతిని నిర్మించలేరు. నిజానికి కొద్ది మంది తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, అవకాశవాదంతో సమర్ధించే దేశభక్తి, మూడభక్తి ,మతతత్వ రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఇతర మతాలకు,సామ్యవాదానికి వ్యతిరేకంగా విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి అధికారంలో కొనసాగుతున్నాది . బీజేపీ మరియు ఆ పార్టీ మాతృ సంస్థ అతికొద్దిమంది హిందూ ఆధిపత్య, సంపన్న వర్గాలకు, అంతర్జాతీయ సామ్రాజ్యవాద దేశాలకు, పెట్టబడిదారి కార్పొరేట్ సంస్థలు, కంపెనీలకు అనుకూంగా పనిచేస్తుంది. నూటికి తొంబై శాతం దేశ ప్రజలకు వ్యతిరేకంగా పని చేస్తుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.
కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు, పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా మార్చివేసింది, ఎనిమిది గంటల పని విధానాన్ని పన్నెండు గంటల పని విధానంగా మార్చివేసింది, కనీస వేతనాల చట్టం అమలు కావడం లేదు. పని చేసే ప్రదేశంలో మౌలిక సదుపాయాలు కల్పన గాలికి వదిలేశారు, రైతు వ్యతిరేక చట్టాలను ముందుకు తీసుకొచ్చారు, శాస్తీయ విద్య విధానం స్థానంలో కట్టు కథలు, పిట్టకథలు, మూఢనమ్మకాలను బోధిస్తున్నారు,ఇప్పటికే అనేక ప్రభుత్వ పాఠశాలాలు మూసివేయబడ్డాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రవేట్, కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వంలో నాణ్యమైన వైద్యం సామాన్యులకు అందుబాటులో లేదు,నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ప్రభుత్వంలో చలనం లేదు,నకిలీ ఉత్పత్తుల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.మాదకద్రవ్యాల వాడకం పెరిగింది, నియంత్రణ చర్యలు తీసుకోవడం లో నిర్లిప్తత ఎందుకు.
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు నియంత్రణ చర్యలు లేవు, జిఎస్టీ పేరుతో ముక్కు పిండి అధిక మొత్తాలను వినియోగదారుల నుండి వసూలు చేస్తున్నారు, డాలర్ విలువ కు రూపాయి రోజురోజుకు పతనం వైపు నెట్టివేస్తున్నారు. దళితులు, ఆదివాసీలు, మైనార్టీల పైన దాడులు పెరిగాయి. పద్నాలుగు సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఎన్ని ఉత్పాదక పరిశ్రమలు కొత్తగా ఏర్పాటు చేశారు, ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయంగా ఇవ్వాల్సిన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి ఉద్యోగుల వేతనల నుండి పది నుండి పదిహేను శాతాన్ని మెజారిటీ హిందువుల నోళ్లు కొట్టి కార్పొరేట్ హిందువులకు (షేర్ మార్కెట్) దోచిపెడుతున్నారు.
నోట్ల రద్దు వల్ల ఎంత నల్లదనం వెలికి తీశారు, కేంద్ర ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాలీ గా ఉన్నటువంటివి,ముఖ్యంగా రైల్వే, బీమా,బ్యాంకింగ్, టెలికం,జ్యుడిష్యరీ సంస్థల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు, ఎస్సీ,ఎస్టీ, బీసీలకు సంక్షేమం, అభివృద్ది, పాలనలో భాగస్వామ్యం ఎంత కల్పించారు. పైన పేర్కొన్న అంశాలు మెజారిటీ హిందువులకు ప్రయోజనం కల్పించేటివే కథ, ఏ ఒక్క సమస్యను పరిష్కారం చేయకుండా మెజారిటీ మతస్తులను దేవునిపేరుతో, సాంప్రదాయ పేరుతో, దేశభక్తి, మతతత్వం పేరుతో ఇంకా ఎంత కాలం గారడి చేస్తారు.మధ్యతరగతి బుద్ధిజీవులు ఆలోచించాలి.
దేశ స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు,బ్రిటిష్ పాలకులకు అనుకూంగా వ్యవహరించిన తీరు చరిత్ర పుటల్లో నిక్షిప్తమై ఉన్నది.మనం ఈ దేశ పౌరులు గా ఆలోచించాలి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ దేశాన్ని అన్ని రకాలుగా విదేశీ పెట్టుబడిదారులు దోపిడీదారులకు దోచి పెడుతుంది ఆ పార్టీ ని తప్పించి బీజేపీకి అధికారం ఇవ్వండి, మేము ఈ దేశాన్ని ప్రగతి వైపు తీసుకొని పోతాం, ప్రజలందరికీ సంక్షేమం అభివృద్ది ఫలాలు అందిస్తాం, నల్ల ధనాన్ని తీసుకొని వచ్చి 15 లక్షల రూపాయలు అకౌంట్స్ లో వేస్తామని ఎన్నికల్లో మాట్లాడటం ద్వారా మెజారిటీ ప్రజలు బీజేపీని నమ్మి ,అధికారం అప్పగించారు. నిండు పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చారు.
మన దేశ ఎన్నికల కమిషన్ ఎన్నికల్లో డబ్బు మద్యం బహుమతులు ప్రలోభాలను అదుపు చేయలేని ధృతరాష్ట్ర (ఎన్నికల) కమిషన్ గా చరితార్థం అయినది అని మీడియాలో వార్తలు వస్తున్నాయి, ఎన్నికలప్పుడే పాకిస్తాన్ టెర్రరిస్టుల దాడులు జరుగుతాయి, అప్పటికప్పుడు దేశభక్తి వోట్లు గా మారుతాయి, ఎన్నికలప్పుడే అయోధ్య రాముడు ముందుకు వస్తాడు,దైవభక్తి పొంగిపొర్లుతుంది వోట్లు గా మారుతుంది, ఇప్పుడు వీటి అవసరం లేకుండా ఈ వి ఎమ్ ల ట్యాంపరింగ్ ద్వారా నేరుగా వోటు చోరీ జరుగుతుంది, గంపగుత్తగా వోట్ల దొంగతనంతో దొడ్డిదారిలో అనైతిక విజయన్నీ విజయంగా చూపిస్తూ అధికారాన్ని గబ్బిలం లాగా పట్టుకొని వెల్లడుతున్నారు.
నిజంగా ఆర్ఎస్ఎస్ , బీజేపీ లు బోధించే జాతీయత, దేశభక్తి, హిందుత్వలో బలము, నిజాయితీ, నైతికత, చిత్తశుద్ధి వుంటే ఇటువంటి విధానాలను ఎందుకు దిగజారుతున్నారు. ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ అనుమానించడం ఎందుకు, తప్పుడు కేసులు పెట్టడం ఎందుకు, అబద్ధపు ఎన్కౌంటర్లు ఎందుకు. పత్రిక స్వేచ్ఛకు సంకెళ్ళు ఎందుకు, మెజారిటీ హిందువులకు న్యాయం జరగడంలేదు వాళ్లందరూ బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీలను నిలదీస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలు, ఆదివాసీలు, దళితులు మెజారిటీ ప్రజలు. స్వదేశీ జాగరణ మంచ్ అధికారంలో లేనప్పుడు స్వదేశీ వస్తువులు మాత్రమే వాడాలి అనేది. ఇప్పుడు ఎందుకు అనడం లేదు. ఆదివాసీ ప్రాంతాల్లో 1/70 చట్టం, పెస యాక్ట్ ఎందుకు అమలు కావడం లేదు, అదానీ అంబానీ, జిందాల్, తదితర పెట్టుబడిదారులకోసం మాత్రమే వందల, వేల ఎకరాల భూములు అప్పజెప్పడం కోసం, దేశ అత్యున్నత ప్రభుత్వ రంగ సంస్థలు పరిశ్రమలను దొడ్డిదారిన అప్పజెప్పడం కోసమే బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చారా, కాదు కదా ..,
అడవులను ధ్వంసం చేయడం వల్ల దిల్లీ , ముంబాయి,కలకత్తా, బెంగుళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల్లో వాయుకలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది,దీనివలన శ్వాసకోశ సంబంధిత వ్యాధులకి ప్రజలు గురవుతున్నారు.ప్రకృతిలో సహజ సిద్ధంగా వచ్చే మార్పులకు భిన్నంగా అకాల వర్షాలు,అధిక ఉష్ణోగ్రతలు,అతి శీతల వాయువులు పెరిగిపోతున్నాయి తగిన చర్యలు తీసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం,ఎందుకు శాస్త్రీయంగా అధ్యయనం చేయడం లేదు , రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు జరగం లేదు, దేశంలో యాభై ఆరు శాతం గా ఉన్న బీసీలకు యాభై ఆరు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా అడ్డుపడుతున్నది ఎవరు, సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ది పాలనలో భాగస్వామ్యం కేంద్రంగా కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఏ పార్టీ ఉన్నా రాజకీయ పార్టీలకు అతీతంగా పాలన కొనసాగాలి అనేది దేశంలోని మెజార్టీ ప్రజల అభిమతం. మాకు సిద్ధాంతాలు, రాద్దాంతాలు కాదు కావలసింది. రంగు రంగుల జెండాల అద్దాలు కాసేపు పక్కన పెట్టి స్వంత కండ్లతో చూద్దాం,స్వతంత్రంగా బాధ్యత కలిగిన పౌరునిగా ఆలోచిద్దాం,మనం ఏమి ఆశించి వేస్తున్నామో దానికి తగ్గట్లుగా మన వోటు ద్వారా ఎన్నికైన పాలకులు నడుచుకుంటున్నారో లేదో కూడా చూడాల్సిన బాధ్యత మనందరిది ,రాజ్యాంగం ప్రకారం ఏమి జరగాలి,ఏమి జరుగుతుంది అనే నిజాల వెలుగులోకి రావడానికి ప్రయతింద్దాం..
-బెజ్జంకి ప్రభాకరాచారి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాజ్యాంగ పరిరక్షణ వేదిక, తెలంగాణ రాష్ట్రం





