గాలించండి కొంచం

విద్వేషాల మనుషులు

వెదజల్లే హాలాహలం

నేడు సమాజమంతా

ఏదో తెలియని కలకలం

ద్వేష దూషణలతో

పగా ప్రతీకారాలతో

రగిలిపోతూ ప్రపంచం

యుద్ధ మేఘాలతో

గడగడ లాడుతుంది

ప్రతి ఇంట్లోనూ

శాంతి కపోతాలకై

గాలించండి కొంచం

-శ్రిష్టి శేషగిరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *