ఏదులాపురాన్ని రోల్ మోడల్‌గా తీర్చుదిద్దుతా

– మంత్రి పొంగులేటి
– రూ. 2.5 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
– గత ప్రభుత్వం కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టింది
– అర్హులైన ప్రతి పేదవానికీ ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు

ఏదులాపురం, ప్రజాతంత్ర, జనవరి 26: రాబోయే రోజుల్లో ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన (రోల్ మోడల్) మున్సిపాలిటీగా తీర్చుదిద్దడమే తన లక్ష్యమని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో సుమారు రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సి.సి. రోడ్లు, డ్రైనేజీ పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. కోట నారాయణపురంలో రూ.22.6 లక్షలతో సీసీ డ్రైను నిర్మాణానికి, ఎస్సీ బీసీ కాలనీలో రూ.72 లక్షల వ్యయంతో అంతర్గత సి.సి రోడ్లు, డ్రైన్ల పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే గుదిమళ్ళలో రూ. 44.55 లక్షలతో, ఇందిరమ్మ కాలనీ-1లో రూ.75.85 లక్షల అంచనాతో చేపట్టనున్న అంతర్గత సి.సి రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. వీటితోపాటు నంద్యాతండాలో రూ.26.55 లక్షలతో డ్రైన్లు, జంగాల కాలనీలో రూ. 14.10 లక్షలతో సి.సి. రోడ్లు, డ్రైన్ల పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే పూర్తి బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన సభల్లో గత బీఆరఎస్ ప్రభుత్వంపై మంత్రి ఘాటు విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే లక్షల కోట్ల కమీషన్లు వస్తాయనే ఆశతోనే గత పాలకులు దానిపై దృష్టి పెట్టారు. కానీ పేదలకు ఇళ్లు కడితే కమీషన్లు రావనే సాకుతో ఆ పథకాన్ని పూర్తిగా విస్మరించారు అని మండిపడ్డారు. పేదవారి కష్టం తెలిసిన ప్రభుత్వం తమదని, అందుకే అర్హులైన ప్రతి పేదవానికీ ఇళ్లతో పాటు ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామని ప్రకటించారు. రైతు సంక్షేమానికి పెద్దపీటసంక్షేమ పథకాల అమలులో ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. గత ప్రభుత్వం రైతు బంధు కింద రూ. 10 వేలు మాత్రమే ఇస్తే, తమ ప్రభుత్వం రైతు భరోసా కింద రూ.12 వేలు అందిస్తూ రైతులకు అండగా నిలుస్తోందని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ప్రజల దీవెనలు తమ ప్రభుత్వంపై ఉండాలని ఆయన కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌జ‌ల‌ శ్రేయ‌స్సు కోసం ప్ర‌భుత్వం శ్ర‌మిస్తోంది

వర్ధన్నపేట: రెండేళ్లుగా మీకు అండగా ఉంటూ మీ శ్రేయస్సు కోసం ముందుకు వెళ్తున్నామ‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు.  వర్డన్నపేట నియోజక వర్గంలో ప్రధానం గా మున్సిపాలిటీ లో రూ.294 కోట్ల తో వివిధ అభివృద్ధి  పనులకు సోమ‌వారం శంకుస్థాపన చేసిన అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ  ఇది పెదోళ్ల ప్రభుత్వం నిరంతరం పేద వారి సంక్షేమం కోసం కృషి చేసే ప్ర‌భుత్వ‌మ‌న్నారు. ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా పేదవారికి ప్రతి ఇంటికి 200 యూనిట్ ల ఉచిత కరెంట్ అందిస్తున్నాం.దేశం లో ఏ రాష్ట్రం చేయని విధం గా ధనికులు తినే సన్న బియ్యాన్ని పేద వారికి అందిస్తున్నాం, గత ప్రభుత్వం 10 సం.లలో అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వక పోగా ప్రజా ప్రభుత్వం రాగానే అర్హులకు రేషన్ కార్డులు అందజేశాం. ప్రజా ప్రభుత్వం పిల్లలకు 40% డైట్ చార్జీలతో పాటు ఆడ పిల్లలకు 200%  కాస్మొటిక్ ఛార్జీ లు పెంచాం. విద్యా వైద్యానికి పెద్ద పీఠ వేసి రాష్ట్రం లో ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి  రూ. 200 కోట్ల తో అంతర్జాతీయ స్థాయి లో నేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ లను నిర్మించుకుంటున్నామ‌న్నారు. గత ప్రభుత్వం మొక్కుబడిగా  పాడుబడ్డ కోళ్ల ఫారాల్లో, రైస్ మిల్లులలో ఏర్పాటు చేస్తే పిల్లలు ఇబ్బంది పడుతున్నారని గ్రహించి ఈ నాడు అద్భుతమైన బిల్డింగులు కట్టి పేద వారి పిల్లలకు మంచి విద్యను అందించాలని చూస్తున్నాం. పేదోనికి ఇల్లు ఇస్తే నాకేమీ కమీషన్ వస్తది, కాళేశ్వరం కడితే కమీషన్ వస్తాదని కాళేశ్వరం కట్టి లక్ష కోట్లు కమీషన్ తీసుకున్నాడు తప్ప పేదోనికి ఇళ్లు ఇవ్వలేదన్నారు. ప్రజా ప్రభుత్వం మొదటిసారి 4 లక్షల 20 వేల ఇళ్లను  రూ.22,500 కోట్లతో ప్రతి ఇంటికి రూ.5 లక్షలు ఉచితంగా ఇస్తోంద‌న్నారు. మొదటి విడతలో  ప్రతి నియోజక వర్గానికి 3500 ఇళ్లు ఇచ్చాం.. ఏప్రిల్ లో మళ్ళీ ఇస్తాం, ఆనాడు వరి వేస్తే ఉరి అన్నారు అలాంటి స్థితిలో రైతన్నకు మద్దతు ధరతోపాటు బోనస్ ఇచ్చాం. పేద వారి కష్టాలు తెలియక విస్మరించి,పదవి పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని  విమర్శించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామ‌న్నారు. గతంలో అధికార అహంకారంతో చేసిన ఫోన్ ట్యాపింగ్ కానీ , కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, పవర్ కొనుగోలు కానీ, ఈ- రేస్ కానీ చేసిన తప్పులు, తాగినోడు కడతాడు తాళ్ళ పన్ను అన్నట్టు తప్పు చేసిన వాడు శిక్షకు అర్హుడన్నారు. అభివృద్ధిని ఎక్కడ కుంటుపడకుండా పేద వాళ్లకు అందిస్తుందన్నారు.  వర్డన్నపేట మున్సిపాలిటీనీ నందన వనంగా తీర్చేలా ఏం ఎల్ ఏ  నిరంతరం కృషి చేస్తున్నారని, చాలావరకు విజయవంతమ‌య్యార‌న్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని పట్టుబడుతున్నారని ఇందులో 100% సక్సెస్ అవుతారన్నారు. వ‌చ్చే మున్సిపల్  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సైనికులు,సింహాలు అభ్యర్థులను గెలిపించి దీవించమ‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *