అందరికీ డ్రగ్స్ ‌టెస్ట్ ‌చేద్దాం

– సీఎం రేవంత్‌ను తీసుకు వస్తా
– కేసీఆర్‌ను మీరు తీసుకు రావాలి
– మండలిలో మహేష్‌ ‌గౌడ్‌ ఆవేశపూరిత ప్రసంగం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి 17: అందరికీ డ్రగ్స్ ‌టెస్ట్ ‌చేద్దాం..అందుకు మీరు సిద్దమేనా అంటూ శాసన మండలిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌సవాల్‌ ‌చేశారు. మొయినాబాద్‌ ‌ఫామ్‌ ‌హౌజ్‌ ‌డ్రగ్స్ ‌కేసు సిగ్గు చేటని, బీఆర్‌ఎస్‌ ‌నేతలు సిగ్గు పడాలని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ ‌సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. గత పదేళ్లలో గంజాయి, కొకైన్‌ ‌వంటి మత్తు పదార్థాలు విస్తృతంగా వ్యాపించాయని పేర్కొన్నారు. డ్రగ్స్ ‌నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాప్రతినిధులందరూ డ్రగ్స్ ‌టెస్టులు చేయించుకోవాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. తాను డ్రగ్‌ ‌టెస్టుకు సీఎం రేవంత్‌ ‌రెడ్డిని తీసుకువస్తానని, బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌సిద్ధమా? అని మహేష్‌ ‌గౌడ్‌ ‌సవాల్‌ ‌విసిరారు. మీరు  మీ నాయకుడిని డ్రగ్స్ ‌టెస్టుకు తీసుకురండి. నేను మా సీఎం రేవంత్‌ ‌రెడ్డిని తీసుకువస్తాను’ అంటూ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌సవాల్‌ ‌విసిరారు. రాష్ట్రంలో గత రెండేళ్లుగా డ్రగ్స్ ‌నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇటీవల డ్రగ్స్ ‌కేసులో బీఆర్‌ఎస్‌కు చెందిన ఒక నాయకుడు పట్టుబడిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ పార్టీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుందో ప్రశ్నించారు. ప్రజలకు, ముఖ్యంగా యువతకు సరైన సందేశం ఇవ్వాల్సిన బాధ్యత నాయకులపై ఉందని అన్నారు. డ్రగ్స్ ‌సమస్యపై శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా కోరారు. డ్రగ్స్ ‌కేసుల్లో ఎంత పెద్దవారైనా వదిలే ప్రసక్తే లేదని మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులకు బీ-ఫారమ్‌ ఇచ్చే ముందు డ్రగ్స్ ‌టెస్టులు చేయాలని సూచించారు. కొందరు నాయకులు డ్రగ్స్ ‌వ్యాపారంలో నేరుగా పాల్గొంటున్నారనే ఆరోపణలు కూడా చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు చేసిందని తెలిపారు. గాంధీ విగ్రహం అంశంపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మూసీ నది పరిస్థితిపై కూడా స్పందిస్తూ.. అభివృద్ధి లేకపోతే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాష్టాన్రికి, దేశానికి సేవ చేసిన మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. సోషల్ ‌మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం తాత్కాలికమేనని, ప్రజలు వాస్తవాలను గుర్తిస్తారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వంద సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌ధీమా వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *