బాలాపూర్‌ రీసెర్స్‌ సెంటర్‌లో చిరుతలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లోని రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఆర్సీఐ) ప్రాంగణంలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. ఇక్కడ రెండు చిరుత పులులను గుర్తించిన అటవీ శాఖ అధికారులు వాటి కోసం ఆర్సీఐ అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు, చిరుతలను బంధించేందుకు బోన్లను ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం చిరుతలు ఓ కుక్కను చంపడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రెండు రోజుల క్రితం ఆర్సీఐ ప్రాంగణంలో రెండు చిరుత పులులు సంచరించడాన్ని అక్కడి వాచ్మెన్‌ గుర్తించి వెంటనే ఉన్నతాధికారులకు తెలుపగా రక్షణశాఖ అధికారులు అప్రమత్తమై అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ అధికారులు ఆర్సీఐ పరిసర ప్రాంతాల్లో రెండు బోన్లు ఏర్పాటు చేశారు. తొలుత వీటిని వన్యప్రాణాలుగా భావించారు. కానీ ఆర్సీఐ ప్రాంగణంలో కుక్క మృతిచెంది ఉండడాన్ని గమనించి అప్రమత్తమైన అధికారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా వారు చేరుకుని పాద ముద్రలను, సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. వాటిని రెండు చిరుత పులులుగా నిర్ధారణకు వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *