గౌరవెల్లి ప్రాజెక్టుకు లీగల్‌ ‌సమస్యలు

– ప్రాజెక్టు ఆలస్యానికి అదే కారణం
– సచివాలయంలో సమీక్షించిన మంత్రులు ఉత్తమ్‌, ‌పొన్నం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 23: అనేక కారణాలు, లీగల్‌ ‌సమస్యల వల్ల గౌరవెల్లి ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుపై మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ సచివాలయంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రాజెక్టు కాలువల భూసేకరణ పూర్తి చేసి పనులు వేగవంతం చేసేలా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ ‌మాట్లాడారు. పొన్నం ప్రభాకర్‌ ‌గౌరవెల్లి ప్రాజెక్టు కోసం తమ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలిపారు. సిద్దిపేట, కరీంనగర్‌, ‌హనుమకొండ మూడు జిల్లాల కలెక్టర్‌లు, రాష్ట్ర అడ్వకేట్‌ ‌జనరల్‌, ఇరిగేషన్‌ అధికారులతో సక్షా సమావేశం నిర్వహించామని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టులో లీగల్‌ ఇబ్బందులు ఎలా క్లియర్‌ ‌చేయాలో చర్చించామని ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు భూసేకరణ, పనుల వేగవంతంపై ఎలా ముందుకు వెళ్లాలో చర్చించామన్నారు. భూసేకరణ విషయంలో హామీ ఇచ్చామని తెలిపారు. సంబంధిత నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చామని అన్నారు. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టులో ఈ ప్రాజెక్టు కేసు విచారణ ఉందని ప్రస్తావించారు. సర్వోన్నత న్యాయస్థానంలో ఎన్విరాన్‌మెంట్‌ ‌కేసు గెలుస్తామనే విశ్వాసం తమకుందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును అన్ని విధాలుగా పూర్తిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు నీళ్లు హుస్నాబాద్‌ ‌నియోజకవర్గానికి రావడానికి కావల్సిన పెండింగ్‌ ‌పనులు పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇరిగేషన్‌ ‌స్పెషల్‌ ‌సెక్రటరీ ప్రశాంత్‌ ‌జీవన్‌ ‌పాటిల్‌, ‌కరీంనగర్‌, ‌సిద్దిపేట, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్‌ అధికారులు, ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *