పల్లె పోరు.. కేసుల పరిష్కారానికి లీగల్‌ సెల్‌

– ముగ్గురు సూపరింటెండెంట్‌స్థాయి అధికారులతో ఏర్పాటు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం మొదలైన సందర్భంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్‌లో లీగల్‌ సెల్‌ ఏర్పాటైంది. ఎన్నికల్లో రిజర్వేషన్లను సవాలు చేస్తూ కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ప్రభుత్వం లీగల్‌ సెల్‌ను ముగ్గురు సూపరింటెండెంట్‌స్థాయి అధికారులతో ఏర్పాటు చేసింది. నిర్దిష్ట కాలపరిమితిలో ఎన్నికలు పూర్తిచేసే విధంగా, ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా వెంటనే చర్యలు తీసుకునేలా జిల్లాలతో ఈ సెల్‌ సమన్వయంతో ముందుకు వెళ్తుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎన్నికల అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు కేసులకు సంబంధించిన వివరాలు, సూచనలు 24 గంటల్లోపు అదనపు అడ్వొకేట్‌ జనరల్‌, గవర్నమెంట్‌ ప్లీడర్‌ కు నివేదించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ సృజన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లాలో కోర్టు కేసులను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిని నియమించాలని, కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన లీగల్‌ సెల్‌తో సమన్వయం చేసుకోవాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *