– ‘మున్సిపల్’ ప్రచారానికి ఎల్‌ఈడీ రథాలు సిద్ధం
– ఆవిష్కరించిన అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: రాష్ట్రంలో మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాన్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించేందుకు వినూత్నంగా రూపొందించిన ఎల్‌ఈడీ స్క్రీన్లతో కూడిన ప్రచార రథాలను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, అలాగే స్థానిక సంస్థల స్థాయిలో బీజేపీ దృష్టికోణం, విజన్‌ను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో ఈ ప్రచార రథాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఎల్‌ఈడీ స్క్రీన్ల ద్వారా పార్టీ విధానాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, నగరాభివృద్ధిపై బీజేపీ ప్రతిపాదనలు ప్రజలకు సులభంగా, స్పష్టంగా చేరతాయని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారమే బీజేపీ ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో మహారాష్ట్ర మంత్రి, మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర ఇన్‌చార్జి ఆశిష్ షెల్లార్, రాజస్థాన్ మాజీ మంత్రి, మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర కో-ఇన్‌చార్జి అశోక్ పర్ణామి, రాజ్యసభ సభ్యురాలు, మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర కో-ఇన్‌చార్జి రేఖాశర్మ, రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో మహిళా శక్తి కీలక పాత్ర
మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ప్రచారాన్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించే లక్ష్యంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో మహిళా శక్తి కీలక పాత్రను పోషిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో మహిళా కార్యకర్తలు ముందుండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహారాష్ట్ర మంత్రి, పార్టీ మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర ఇన్‌చార్జి ఆశిష్ షెల్లార్, రాజస్థాన్ మాజీ మంత్రి, రాష్ట్ర కో-ఇన్‌చార్జి అశోక్ పర్ణామి, రాజ్యసభ సభ్యురాలు, రాష్ట్ర కో-ఇన్‌చార్జి రేఖాశర్మలు ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్, ఇతర నాయకులు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





