– ‘కిట్స్ ’ అడిషనల్ సెక్రటరీ సతీష్ కుమార్
– ‘కిట్స్’లో ముగిసిన ప్రొఫెషనల్-కాలేజియేట్ టోర్నమెంట్-2026
వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 16: ఆటల వల్ల నాయకత్వ లక్షణాలను పొందుతారని, రోజువారీ జీవితంలో సాధారణ తప్పులు తగ్గుతాయని, విద్యార్థులు గెలుపు స్ఫూర్తిని కలిగి ఉండాలని కిట్స్ అడిషనల్ సెక్రటరీ వి.సతీష్ కుమార్ ఉద్బోధించారు. కిట్స్ వరంగల్ ఇంజనీరింగ్ కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం (పిఈ) ఆది, సోమవారాల్లో నిర్వహించిన పురుషుల, మహిళల ప్రొఫెషనల్-కాలేజియేట్ టోర్నమెంట్-కిట్స్ ట్రోఫీ-2026 సోమవారం ఘనంగా ముగిసింది. ముఖ్య అతిథిగా ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన ఉజ్వల భవిష్యత్తుకు ఆటలు, క్రీడలు అవసరమంటూ ఈ టోర్నీ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని అన్నారు. కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్ కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు, కోశాధికారి పి.నారాయణ రెడ్డి ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం, 17 ప్రొఫెషనల్ కళాశాలల నుంచి విచ్చేసిన క్రీడాకారులను అభినందించారు. గౌరవ అతిథి ‘నిట’ వరంగల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ పి.రవికుమార్ మాట్లాడుతూ ఆటలు, క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సాంకేతిక సామర్థ్యాల అభివృద్ధికి, విద్యార్థి సమాజంలో వ్యక్తిగత నైపుణ్యాలు, సృజనాత్మక నైపుణ్యాలను పెంపొందించడానికి ‘కిట్స’ పాఠ్యాంశాల్లో ఆటలు, క్రీడలను ప్రవేశపెట్టారన్నారు. ఎనఐటీడబ్ల్యూ, కేఎంసీ వరంగల్, కేయూసీఈ, తాళ్ల పద్మావతి ఇంజినీరింగ్, చైతన్య ఇంజినీరింగ్, ఎసఆర్ యూనివర్శిటీ, వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజీలు తదితర మొత్తం 17 ప్రొఫెషనల్ కాలేజీల నుంచి 800మంది పైగా విద్యార్థులతో కూడిన 50 బృందాలు పాల్గొన్నాయి. కార్యక్రమంలో కిట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి డాక్టర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, పీఈడీ అధ్యాపకులు కె.వెంకటస్వామి, ఎస్.మహేష్, ఆర్.నాగరాజు, వివిధ విభాగాల డీన్‌లు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ పీఆర్వో డాక్టర్ డి.ప్రభాకరాచారి, సిబ్బంది, విద్యార్థులు, కిట్స్ వరంగల్ స్పోర్ట్స్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
విజేతలు 
నిట్ వరంగల్ బాస్కెట్‌బాల్ (మెన్) విన్నర్, కిట్స్ వరంగల్ రన్నర్‌గా, బాస్కెట్ బాల్ (మహిళలు) కిట్స్ వరంగల్ విజేతగా, నిట్ వరంగల్ రన్నర్ గా, బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా కిట్స్ వరంగల్ అలుమ్ని, కిట్స్ వరంగల్ రన్నర్‌గా నిలిచారు. ఫుట్‌బాల్‌లో నిట్ వరంగల్ విన్నర్‌గా, కిట్స్ వరంగల్ రన్నర్‌గా నిలిచాయి. కబడ్డీలో నిట్ వరంగల్ విజేతగా, కిట్స్ వరంగల్ టీమ్ రన్నర్, కబడ్డీ (మహిళలు)లో వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజీ విజేతగా నిలిచింది. వాలీబాల్ మెన్ విభాగంలో ఎస్వీఎస్ ఇంజనీరింగ్ కళాశాల విజేతగా, కాకతీయ మెడికల్ కాలేజ్ రన్నర్‌గా, వాలీబాల్ (మహిళలు)లో నిట్ వరంగల్ విజేతగా, కిట్స్ వరంగల్ రన్నర్‌గా నిలిచింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




