– నల్లగొండ రాజకీయాలపై ఆయనది చెరగని ముద్ర
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: ఉమ్మడి నల్లగొండ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి అని, అయన మరణం అత్యంత బాధాకరమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మాజీ మంత్రి, దివంగత నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలపాటు ఉమ్మడి నల్లగొండ రాజకీయాలలో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప నాయకుడు మన మధ్య లేకపోవడం విచారకరమని అన్నారు. ప్రజలకు సేవ చేయడంపట్ల ఆయనకున్న నిబద్ధత, అంకితభావం స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి సైతం తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రార్థించారు. మీ వెంట మేమున్నాం.. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఎప్పటికీ ఉంటుందని దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తమ్ రెడ్డికి ధైర్యం చెప్పారు.
దామోదర్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం పార్టీకి పెద్ద లోటు అని పలువురు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. బీసీ సంక్ష్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇక లేరు అనే వార్త కలచివేసిందన్నారు. దామన్న తనకు అత్యంత సన్నిహితుడని, కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి మంత్రి వరకు ఎదిగిన ఒదిగి ఉన్న నేత.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారని తెలిపారు. నేడు రాజకీయాల్లోకి వచ్చే యువతకు ఆయన జీవితం ఆదర్శమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



