– ఆలయాలే లక్ష్యంగా దాడికి స్కెచ్
– నిఘా వర్గాల హెచ్చరికలు జారీ
– ఇతర నగరాల్లోనూ పేలుళ్లకు కుట్ర
న్యూదిల్లీ, ఫిబ్రవరి 21: దేశ రాజధాని దిల్లీలో మరోసారి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తయిబా(ఎల్ఈటీ) కుట్ర పన్నింది. ఈ మేరకు నిఘా వర్గాల హెచ్చరికలతో దిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట, చాందీనీ చౌక్ ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాలే లక్ష్యంగా ఎలఈటీ దాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. చాందీనీ చౌక్ ప్రాంతంలోని ఒక దేవాలయంపై ఐఈడీతో దాడి చేసేందుకు ఉగ్రవాదులు వ్యూహం పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈనెల 6న పాకిస్థాన్ ఇస్లామాబాద్‌లోని ఒక మసీదులో జరిగిన పేలుడుకు ప్రతీకారంగా భారత్‌లోని ప్రముఖ ధార్మిక స్థలాలపై దాడులు చేయాలని లష్కరే ప్లాన్ చేస్తోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. కేవలం దిల్లీలోనే కాక దేశంలోని ఇతర ప్రాంతాల ప్రముఖ దేవాలయాలు కూడా ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నవంబర్ 10న ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో 12మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో మరోసారి ఎర్రకోట పరిసర ప్రాంతాలపై ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలు దేశ రాజధానిలో కలకలం రేపుతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




