– పదిమంది భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలు
ములుగు, ప్రజాతంత్ర, జనవరి 26: తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు పేలి 10 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. కర్రెగుట్టల్లో మావోయిస్టుల కదలిక, ఐఈడీలు అమర్చినట్లు భద్రతా సంస్థలకు విశ్వసనీయ సమాచారం అందడంతో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అనేక ఐఈడీలు ఒకదాని తర్వాత ఒకటి పేలాయి. దీంతో జవాన్లు గాయపడ్డారు. వారిని ఆర్మీ హెలికాప్టర్‌లో రాయ్‌పుర్‌కు తరలించారు. వీరిలో 9 మంది డీఆర్‌జీ, మరొకరు కోబ్రా బెటాలియన్‌కు చెందినవారు. గాయపడిన భద్రతా సిబ్బందికి ప్రాణాపాయం తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో కర్రెగుట్టల్లో హైఅలర్ట్ ప్రకటించి కూంబింగ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు. గతేడాది ఇదే ప్రాంతంలో 21 రోజుల పాటు దేశంలోనే అతిపెద్ద మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



