- దాదాపు రూ.వంద కోట్ల ఆస్తుల గుర్తింపు
హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబరు4: అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్సు ఏడీ శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. దాదాపు వందకోట్ల ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. ఏడీ శ్రీనివాస్ నివాసం, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు తెలంగాణ, ఏపీ, కర్ణాటకల్లో భారీగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో సోదాలు చేసిన అధికారులు.. రాయదుర్గం మైహోంభుజలో ప్లాట్, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, అనంతపురంలో 11 ఎకరాలు, మహబూబ్‌నగర్‌లో నాలుగు ప్లాట్లు, నారాయణపేటలో రైస్ మిల్లు, 3 ప్లాట్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. సోదాల్లో రూ.5లక్షల నగదు, 1.6 కిలోల బంగారం, 770 గ్రాముల వెండి, 2 కార్లు, పలు పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.