కుటుంబ భూ సమస్యను రాజకీయం చేయడం తగదు

– మంత్రి పొంగులేటి, వారి కుటుంబానికి సంబంధం లేదు
– కేటీఆర్, హరీష్ రావులు ఒకవైపే విని ఆరోపణలు చేయడం న్యాయమా?
– మాకు చట్టబద్దంగా ఇచ్చిన భూమిలోనే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టామన్న సిద్ధార్థ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: వట్టినాగులపల్లి సర్వే నెంబర్ 245 వ్యవసాయ భూమి లో జరుగుతున్న భూ వివాదానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గానీ వారి కుటుంబానికి గాని ఎలాంటి సంబంధం లేదని, రాఘవ కన్స్ట్రక్షన్స్ కు తాము ఏలాంటి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయలే దని వట్టినాగులపల్లి యజమానులు స్పష్టం చేశారు. మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి తన అధికార బలాన్ని ఉపయోగించి స్థలాన్ని కబ్జా చేయడానికి యత్నిస్తున్నారనే బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదు. ఈ భూవివాదంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ని, రాఘవ కన్స్ట్రక్షన్స్ ని ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదు.మా కుటుంబానికి సంబం ధించిన స్థలాల బౌండరీ ల విషయంలో మాకు వివాదం ఉంది. దీనికి సంబంధించిన విషయాలను పూర్తి ఆధారాలతో మీడియా ముందు ఉంచుతున్నాం. భూమి విలువపై తప్పుడు ప్రచారం చే స్తున్నారు. అదే భూమిని రూ.600 కోట్లకు కేటీఆర్కు భేషరతుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నిజంగా విలువ ఉంటే కొనుగోలు చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. వట్టినాగులపల్లి భూవ్య వహారంపై సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో భూయ జమానులు పూర్తి వివరాలను మీడియా ముందు ఉంచారు. ఈ సమావేశంలో భూ యజమానులు అవినవ్ షా, సుధీర్ కుమార్ షా, అక్షయ్ షా, న్యూజెన్ డెవెలపర్స్ ఎండీ సిద్దార్ద్ గాదె ఏమన్నారంటే.. అవినవ్ షా, భూ యజమాని రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని సర్వే నెంబర్ 259లో తనకు ఒక ఎకరం భూమి ఉందని, సతీష్ షా తనకు తండ్రి సమానులని అవినవ్ షా పేర్కొన్నారు. గత పదేళ్లుగా ఆయన సలహాతోనే పని చేస్తున్నానని, భూమిని డెవలప్మెంట్కు ఇచ్చే ముందు కూడా ఆయనను సంప్రదించానని తెలిపారు. ఇది కేవ లం కుటుంబ వివాదమని, దీనిని ఎందుకు రాజకీయం చేస్తున్నా రో అర్థం కావడం లేదని అవినవ్ షా ఆవేదన వ్యక్తం చేశారు. హరీశ్ రావు, కేటీఆర్ గార్లు కేవలం ఒకవైపే కాకుండా తమ వాదన కూడా వినాలని కోరారు. 2020 నుంచి తాను భూ సర్వే చేయిస్తున్నానని, హైకోర్టు ఆదేశాల ప్రకారం సబ్ డివిజన్, డిమార్కేషన్ జరగాలని కోరుతున్నట్లు తెలిపారు. భువన్ యాప్ ద్వారా వివరాలు సరిచూసుకోవచ్చని, సర్వే చేయించి ఎవరి భూ మి వారికి అప్పగించాలని డిమాండ్ చేశారు. సతీష్ షా ఆస్తిలో అక్రమ రోడ్డు నిర్మించారని, తాను ఆయనను బెదిరించానన్నది అబద్దమని భగవంతుడి సాక్షిగా చెప్పారు. కేసీఆర్ లేదా రేవంత్ రెడ్డి ఎవరిని పిలిచినా సరే, భూ సర్వే చేయించి నిజానిజాలు తేల్చాలని, అనవసరంగా కుటుంబంలో చీలికలు తీసుకురా వద్దని ఆయన కోరారు.

అక్షయ్ షా, భూ యజమాని
వ్యవస్థలను నిష్పక్షపాతంగా సర్వే చేయనివ్వాలని, ఇది పూర్తిగా కుటుంబ వివాదమని అక్షయ్ షా స్పష్టం చేశారు. రాజకీయ ప్రమేయం వద్దని తాము గతంలోనే కోరామని గుర్తు చేశారు. హరీశ్ రావు, కేటీఆర్ పట్ల గౌరవం ఉన్నప్పటికీ, వారు సతీష్ వైపు నిలిచి ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని అభిప్రాయ పడ్డారు. తాము కేవలం సర్వే చేయించమని మాత్రమే కోరుతు న్నామని, ఇందులో రాజకీయం ఎందుకని ప్రశ్నించారు. సరిహద్దులను తేల్చి ఎవరి భూమి వారికి అప్పగిస్తే సమస్య పరిష్కారమవుతుందని ఆయన పేర్కొన్నారు.

సుధీర్ కుమార్ షా, భూ యజమాని
వట్టినాగులపల్లి భూమి తమ కుటుంబానికి చెందినదని, 1969 నుంచి ఈ ఆస్తి కుటుంబం మధ్యనే ఉందని సుధీర్ కుమార్ షా వివరించారు. అన్నదమ్ముల మధ్య భూమి పంపకాల్లో కొంచెం తక్కువ, ఎక్కువ ఉండటం సహజమని, ఏడీ లేదా శాటిలైట్ సర్వే ద్వారా సరిహద్దులు తేలితే వివాదం ముగుస్తుందని చెప్పారు. సర్వే నెంబర్లు 259, 245, 262లలో సర్వే చేయిస్తే, ఎక్కువ ఉన్న వారు వదులుకుంటారని, తక్కువ ఉన్న వారు తీసుకుం టారని తెలిపారు. తమ లక్ష్యం ఒక్కటేనని, భూమిని స్పష్టం చేసుకొని డెవలపర్కు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.

సిద్దార్థ గాదె, న్యూజెన్ కంపెనీ మేనేజింగ్ పార్టనర్

కేటీఆర్, హరీశ్ రావు వంటి నాయకులు ఏకపక్షంగా మాట్లాడటం సరికాదని సిద్దార్థ గాదె అన్నారు. తాము కేవలం డెవలపర్స్ మాత్రమేనని, భూ యజమానులు ఇచ్చిన భూమిపై ప్రాజెక్ట్ చేస్తామని స్పష్టం చేశారు. షా కుటుంబ వివాదంతో తమకేం సంబంధమని రాజకీయ నేతలను ప్రశ్నించారు. తమ సంస్థలో పొంగులేటి హర్ష ఒక పార్టనర్ మాత్రమేనని, రాజకీయంగా ఆయన ను లేదా మంత్రి పొంగులేటిని టార్గెట్ చేయడం వల్ల వా రు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియదు కానీ.. తప్పుడు ప్రచా రం వల్ల కంపెనీ ఇమేజ్ దెబ్బతినడంతో పాటు తమ ఉద్యోగులు, భాగస్వాములు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరును అనవసరంగా వివాదం లాగుతున్నారన్నారు. కాంట్రాక్ట్ తీసుకున్నది న్యూజెన్ కంపెనీ అని స్పష్టం చేశారు. కేటీఆర్ గారు భూమి విలువ రూ.1200 కోట్లు అని చెబుతున్న వారు, అవినవ్ షా కు రూ.600 కోట్లు ఇస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటామని అన్నారని వెల్లడించారు. వివాదం కోర్టులో ఉండగా సతీష్ షా గోడ కట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. కేటీఆర్ ఈ విషయాన్ని ప్రజాకోర్టులో పెట్టారు కాబట్టి, ఇరుపక్షాల వాదనలు విని ఆయనే జడ్జ్ చేయాలని, రాజకీయ ఎజెండాతో ఇతరులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *