– పాఠశాల ప్రహరీ, గదులు కూల్చడం దుర్మార్గం
– చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఎంపీ రఘునందన్ వినతి
సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీఆరఎస్ పదేళ్ల పాలనలో కూడా ప్రభుత్వ భూములను కబ్జా చేశారని విమర్శించారు. వారి కబ్జాలపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తామే కబ్జాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గురువారం పటాన్‌చెరు పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ మీడియాతో మాట్లాడారు. సర్వే నం.428లో 2 ఎకరాల 18 గుంటల స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజాసంక్షేమాన్ని ద ష్టిలో పెట్టుకుని మాత్రమే జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని, కబ్జాదారులకు, జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాల ప్రహరీ బయటనే జాతీయ రహదారి విస్తరణ చేయాల్సి ఉండగా తరగతి గదులను రాత్రికి రాత్రి కూల్చివేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల గదుల పాఠశాల కూల్చివేతలను అధికారులు సీరియస్‌గా తీసుకుని బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



