– రంగారెడ్డి కలెక్టర్ ను కలిసిన గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు బాధితులు
ఆమనగల్లు, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : ఆమనగల్ మండలంలో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న బాధిత రైతులు గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కార్యాలయంలో కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. గ్రీన్ పీల్డ్ రేడియల్ రోడ్డు భూములు కోల్పోతున్న తమ డిమాండ్లను నెరవేర్చిన తర్వాతనే భూ సేకరణ చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ భూమి ఇచ్చే ప్రసక్తే లేదని కలెక్టర్ కు రైతులు స్పష్టం చేశారు. తమ హామీలను నెరవేర్చిన తర్వాతనే భూ సర్వే చేపట్టాలని, లేనిపక్షంలో భూ సర్వే చేయవద్దని వినతి పత్రం అందించారు. ఆమనగల్ మండలానికి చెందిన సాకబండ తండా గిరిజన రైతులతో కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వెళ్లిన గిరిజన రైతులు మాట్లాడుతూ భూములను స్వాధీనం చేకుంటున్న భూసేకరణ అధికారులు నష్ట పరిహారంగా రూ.కోటి 20 లక్షలు ఇవ్వాలని కోరారు. ఫ్యూచర్ సిటీలో 500 గజాల ప్లాటు ఇవ్వాలని భూమి కోల్పోతున్న రైతు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్ ను కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి ఆదుకోవాలన్నారు. కలెక్టర్ ను కలిసిన వారిలో రైతులు పత్యానాయక్, బోడియ నాయక్, రవి రాథోడ్, బాలు నాయక్, రాజేందర్, మణిపాల్, జైపాల్, శివరాం, గన్యా, పాండు, విజేందర్, శ్రీనివాస్ రెడ్డి, రాజురెడ్డి, లక్ష్మారెడ్డి, తదితరులు న్నారు.
—————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



