కాళేశ్వరం కూలింది.. బీఆర్‌ఎస్‌ కుప్పకూలింది

– బీజేపీ ఎంపి లక్ష్మణ్‌ వ్యాఖ్య

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బీఅర్‌ఎస్‌ కూలింది అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. కాళేశ్వరం మూడు పిల్లర్లు కూలిపోతే బీఆర్‌ఎస్‌ మూడు ముక్కలు అయ్యిందని ఎద్దేవా చేశారు. అవినీతిపరులకు బీజేపీలో చోటు లేదని స్పష్టం చేశారు. విూడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అవినీతి కేసు విషయంలో కేంద్రానికి లేఖ రాసిందని తెలిపారు. సీబీఐతో దర్యాప్తు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో తన దగ్గర ఆధారాలున్నాయని చెప్పిన సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పుడు సీబీఐకి ఆ ఆధారాలు ఇచ్చి విచారణకు సహకరించాలని ఆయన సూచించారు. ఘోష్‌ కమిషన్‌ నివేదికలో క్రిమినల్‌ రిఫరెన్స్‌ లేకుండా నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్ల పాత్ర ఏంటో స్పష్టంగా చెప్పలేదని ఆరోపించారు. హరీష్‌ రావు, సంతోష్‌ అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్సీ కవిత బహిరంగంగా చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు యువత, ఉద్యోగులు, ప్రజలు పోరాటం చేస్తే అమరుల త్యాగాలను కేసీఆర్‌ కుటుంబం క్యాష్‌ చేసుకుందని విమర్శించారు. భారత రాష్ట్ర సమితి రూ.వందల కోట్లకు పడగలెత్తిందని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *