కిట్స్ విద్యార్థికి రూ.35 లక్షల ప్యాకేజీ

– క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో 439మంది ఎంపిక

వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 23: క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ డ్రైవ్ ద్వారా VISA Inc.లో బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి సాయిచరణ్ కల్వచెర్ల రూ.35 లక్షల ప్యాకేజీ ఆఫర్‌ను పొందాడు. 2025-2026 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్‌లో 50కి పైగా బహుళజాతి అగ్రశ్రేణి ఐటీ, కోర్ ఇంజనీరింగ్ కంపెనీలలో బీటెక్ విద్యార్థుల క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లు 439 మార్కును చేరుకున్నట్లు రాజ్యసభ మాజీ సభ్యుడు, కళాశాల చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత సెమిస్టర్ కోసం, ఎల్‌టీఐ, మైండ్‌ట్రీ, ఒరాకిల్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టీ-టీఈసీ చబ్స్,ఈడబ్ల్యూజీసీఎస్, రియల్‌పేజ్, హెక్సావేర్ టెక్నాలజీస్, డెక్స్టారా, అశోక బిల్డర్స్, నార్తర్న్ టూల్స్, మేధా సర్వోడ్రైవ్స్, టీసీఎస్, TECHNIPFMC వంటి ప్రఖ్యాత ఎంఎన్‌సీ/టి, ప్రస్తుత చివరి సంవత్సరం బీటెక్, ఎంటెక్ చదువుతున్న విద్యార్థుల నుండి మొత్తం 439మందిని ఎంపిక చేసుకున్నాయని తెలిపారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లను నిర్వహించడానికి అనేక కంపెనీలు వరుసలో ఉన్నాయంటూ బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థులు ఇంటర్వ్యూలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కోశాధికారి పి.నారాయణ రెడ్డి సూచించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఎల్లవేళలా తమ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నెమరువేసుకుంటూ ఉద్యోగ సముపార్జనలో నిమగ్నం కావాలని ఉద్బోధించారు. సాఫ్ట్‌వేర్ కంపెనీ రాత పరీక్ష, టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూలను మూడు దశలలో నిర్వహించగా బీటెక్ చివరి సంవత్సరం 2025-2026 బ్యాచ్‌కు చెందిన సిఈ, ఎంఈ, సిఎస్‌ఎం, సిఎస్‌ఈ, సిఎస్‌ఎన్, సిఎస్‌ఓ, ఐటి, ఈసిఈ, ఈసిఐ, ఈఈఈ వంటి పది బ్రాంచ్‌ల 439 మంది విద్యార్థినీవిద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు. ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సి-ఐ స్క్వేర్ అరఈ) కార్యకలాపాలపై దృష్టి సారించే పాఠ్యాంశాల ఆధారంగా బోధన అందించడం, ఇది నిరంతరం తాజా సాంకేతిక సాధనాలతో సమలేఖనం చేయబడిందని కూడా ఆయన పేర్కొన్నారు. కిట్స్ కళాశాల అదనపు కార్యదర్శి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వి.సతీష్ కుమార్, డీన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్ ప్రొఫెసర్ వై.పురంధర్, టీపీవో డా. టి.చంద్రబాయి, కార్పొరేట్ రిలేషన్స్ మేనేజర్ ఇ.కిరణ్ కుమార్, వివిధ విభాగాల డీన్స్, విభాగాదిపతులు, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ పిఆరఓ డాక్టర్ డి. ప్రభాకరాచారి, ఆప్టిట్యూడ్ ట్రైనర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జి.ధనుష్, డి.శరత్, పి.సింధూర, పి.అరుణ కుమారి, వివిధ విభాగాల హెడ్‌లు, డీన్‌లు, పలువురు బోధన, బోధనేతర సిబ్బంది 439 విద్యార్థులకు అభినందనలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *