హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 17: వివిధ విభాగాల్లో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ – ఎఎ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షా ఫలితాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఈ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా విడుదల చేశారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ అభ్యర్థుల జాబితాను అందుబాటులో ఉంచింది. ఈ ఉద్యోగాలకు పరీక్ష రాసిన అభ్యర్థులు ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1,284 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా.. 24,045 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులకు సంబంధించి పరీక్షను 2024, నవంబర్ 10వ తేదీన నిర్వహించారు. మొత్తం 23,323 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. మెరిట్ లిస్ట్ సిద్ధం చేసి.. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసిన ప్రభుత్వం.. తాజాగా ఫైనైల్ మెరిట్ లిస్ట్ ఉద్యోగానికి ఎంపికైన వారి జాబితాను విడుదల చేసింది. కొత్తగా ఎంపికైన అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోధనాహాస్పిటల్, జిల్లా, ఏరియా హాస్పిటల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నియమించనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





