‘లాపతా వోట్‌’ అం‌టూ రాహుల్‌ ‌పోస్ట్

-‌నిమిషం నిడివితో ఎక్స్‌లో వీడియో
-నేటి నుంచి బీహార్‌లో వోట్‌ అధికార్‌ ‌యాత్ర
-సెప్టెంబర్‌ 1 ‌వరకు బీహార్‌లో రాహుల్‌ ‌పర్యటన

  ‌వోట్‌ ‌చోరీకి పాల్పడుతోందంటూ ఎన్నికల కమిషన్‌పై వరుస విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ మరోసారి వోట్ల చౌర్యంపై వ్యంగ్యాస్త్రాల్రు సంధించారు. హాస్యం, వ్యంగ్యం మేళవించిన స్పూఫ్‌ ‌వీడియోను శనివారంనాడు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ ‌చేశారు. ఎన్నికల సంఘం బీహార్‌లో చేపట్టిన వోటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా, ప్రజల వోటు హక్కుపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ఆదివారం ‘వోటు అధికార్‌ ‌యాత్ర’ను చేపట్టనున్నట్లు కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత అఖిలేష్‌ ‌ప్రసాద్‌ ‌సింగ్‌ ‌తెలిపారు. ఆయన శనివారం పాట్నాలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీహార్‌లో వోటు అధికార్‌ ‌యాత్రను ససారం నుంచి రాహుల్‌ ‌గాంధీ ప్రారంభించనున్నారు. ఈ యాత్ర బహుశా సెప్టెంబర్‌ 1‌న ముగియనుంది. ఈ యాత్ర ముగిసేవరకు రాహుల్‌ ‌రాష్ట్రంలోనే ఉండనున్నారు. ఈ యాత్ర కోసం ముందుగానే అనుమతులు తీసుకున్నాము. ఈ యాత్ర రాష్ట్రంలోని 25 జిల్లాలను కవర్‌ ‌చేస్తుంది. ఆగస్టు 20, 25, 31 తేదీల్లో యాత్రకు విరామం. సెప్టెంబర్‌ 1 ‌పాట్నాలో జరిగే ర్యాలీతో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రలో బీహార్‌ అసెంబ్లీ ప్రతిపక్షనేత తేజస్వియాదవ్‌ ‌పాల్గొంటారు. ఆర్‌జెడితోపాటు ఇండియా బ్లాక్‌లోని ఇతర పార్టీలైన వామపక్ష పార్టీల నేతలు కూడా పాల్గొనున్నారని ఆయన తెలిపారు.
బిహార్‌ ‌వోటర్ల జాబితాలో లోపాలపై కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా ‘లాపతా ఓటు’ అనే టైటిల్‌తో వీడియోను ఎక్స్‌లో శనివారం విడుదల చేశారు. నిమిషం నిడివి ఉన్న ఆ వీడియోలో.. పోలీసు స్టేషన్‌లో ఓ వ్యక్తి తన వోటు- చోరీ చేశారని, ఇంకా లక్షల వోట్లు చోరీ అయ్యాయని అధికారులకు ఫిర్యాదు చేస్తారు. పోలీసు సిబ్బంది చెక్‌ ‌చేసి అందులో తమ వోట్లు కూడా గల్లంతుకావడంతో నిర్ఘాంతపోతారు. అలా ఆ వీడియా ముగుస్తుంది. దీనిని రాహుల్‌ ‌తన అధికారిక ఎక్స్‌లో పోస్టు చేస్తూ.. వోటర్లందరూ చైతన్యంతో ఓ ఉద్యమంలా ముందుకు సాగాలి.  వోటు- చోరీ అయితే  ప్రాథమిక హక్కు చోరీ అయినట్లే  అని  పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా మనమందరం ఉద్యమంగా పోరాడి మన హక్కులను కాపాడుకుందామన్నారు. వోట్ల చోరీ అనేది ‘డూ ఆర్‌ ‌డై’ సమస్యగా కాంగ్రెస్‌ ‌పేర్కొంది. వోట్లు గల్లంతైన వారి కోసం ఓ వెబ్‌ ‌పోర్టల్‌ను కూడా ప్రారంభించింది. అందులో పోల్‌ ‌ప్యానెల్‌ ‌నుంచి వోట్ల గల్లంతుకు వ్యతిరేకంగా నమోదు చేసుకోవడానికి, అధికారుల నుంచి జవాబుదారీతనం కోరడానికి, డిజిటల్‌ ‌వోటరు జాబితాల డిమాండ్‌కు మద్దతు తెలియజేయడానికి ఆ వెబ్‌ ‌పోర్టల్‌ను ప్రారంభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *