– ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, మార్చి 6: క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మూడు వారాల్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. క్యాతనపల్లి మున్సిపాలిటీ వివాదంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లిలో పలు రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అర్ధంతరంగా నిలిచిపోయింది. ఇక బీఆర్‌ఎస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా ఇటీవల బెయిల్ మంజూరు అయింది. ఆ తర్వాత కేతనపల్లిలోని తన నివాసంలో బాల్క సుమన్ విలేకర్లతో మాట్లాడుతూ స్థానిక ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తనను జైల్లో తీవ్ర ఇబ్బందులకు గురిచేశారంటూ పోలీసులపై మండిపడ్డారు. క్యాతనపల్లిలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వేళ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఆగిపోయింది. దీనిపై బీఆర్‌ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పై విధంగా ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





