వరంగల్, ప్రజాతంత్ర : కుట్టు శిక్షణతో మహిళలు ఆర్థికంగా ఎదగవచ్చని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. మంగళవారం ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ హనుమకొండ ఆధ్వర్యంలో హసన్ పర్తి, బైరాన్ పల్లి లోని నిరుపేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమంలో అతిథులుగా డాక్టర్ అనితా రెడ్డి, DLSA సెక్రటరీ క్షమాదేశ్ పాండే ,యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్స్పెక్టర్ J.శ్యాంసుందర్ కలిసి ప్రారంభించారు.
ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్, సహాయ ప్రాజెక్టు కోఆర్డినేటర్లు బత్తుల కరుణ ,ఎర్ర శ్రీకాంత్, ఫైనాన్స్ మేనేజర్ అజయ్, కుమార్ కోఆర్డినేటర్ కె రవి, ఇసంపల్లి సుదర్శన్ , ఏ హెచ్ టి యు పోలీస్ విభాగం నుండి ఎస్ఐ సుధాకర్ ఏఎస్ఐ భాగ్యలక్ష్మి, కానిస్టేబుల్ రామారావు, రుద్రమదేవి మహిళా మండలి ప్రాజెక్టు కోఆర్డినేటర్ రాధిక తదితరులు పాల్గొన్నారు.





