జనగామ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: జనగామ పట్టణానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, పరిశోధకుడు, ఎల్.బి. బిఈడి కళాశాల సీనియర్ తెలుగు అధ్యాపకుడు కోడం కుమారస్వామికి జాతీయస్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సహకారంతో ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ చరిత్ర సదస్సుకు ఆయనకు ఆహ్వానం అందింది. ఐరన్ మ్యాన్స్ విజినరీ లీడర్షిప్ – లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్ అనే ప్రధానాంశంపై జరగనున్న ఈ రెండు రోజుల సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి కాళోజీ కవిత్వం-నిజాం పాలన వ్యతిరేకత అనే అంశంపై తన పరిశోధనా పత్రాన్ని సమర్పించనున్నారు. నిజాం నిరంకుశ పాలనను ప్రజాకవి కాళోజీ నారాయణరావు తన సాహిత్యం ద్వారా ఏవిధంగా ఎదిరించారో, ప్రజలను ఎలా చైతన్యపరిచారు అనే అంశాలపై విశ్లేషణాత్మక ప్రసంగం చేయనున్నారు. జాతీయస్థాయి సదస్సుకు జనగామవాసి ఎంపిక కావడం పట్ల స్థానిక సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జనగామ రచయితల సంఘం అధ్యక్షుడు నక్క సురేష్, కవులు, కళాకారుల ఐక్య వేదిక అధ్యక్షుడు జి.కృష్ణ, సోమేశ్వర్, పానుగంటి రామ్మూర్తి, శ్రీనివాస్ తదితరులు కుమారస్వామిని అభినందిస్తూ ఆయన పరిశోధనలు జిల్లా కీర్తిని చాటుతున్నాయని కొనియాడారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


