ఫార్మసీ విద్యలో కేయూ ప్రతిష్ఠ విశ్వవ్యాప్తం కావాలి 

– వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రతాప్ రెడ్డి 
కాళోజీ జంక్షన్‌/హనుమకొండ ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4: ఫార్మసీ విద్య కళాశాల ద్వారా కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) ప్రతిష్ఠ విశ్వవ్యాప్తం కావాలని యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య కె.ప్రతాప్‌ రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల గోల్డెన్‌ జూబిలీ సమావేశం ప్రిన్సిపాల్‌ ఆచార్య జె.కృష్ణవేణి అద్యక్షతన గురువారం జరిగింది. ముఖ్య అతిథిగా వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ స్పూర్తిదాయకమైన అధ్యాపకులు, విద్యార్థులను ఫార్మసీ కళాశాల అందించిందని, కళాశాల గ్లోరిని కాపాడాలని అన్నారు. గోల్డెన్‌ జూబిలీ నిరంతరంగా కొనసాగాలన్నారు. ప్రారంభ దశలో కళాశాల నిర్వహణను చేపట్టిన అధ్యాపకుల సేవలను అభినందించారు. కళాశాలలో మంచి పరిశోధనలు జరగాలన్నారు, 40 శాతం ‘రుసా’ నిధులు ఫార్మసీ కళాశాలకు కేటాయించినట్టు తెలిపారు. అకడమిక్‌ ద్వారానే గొప్పతనం వస్తుందన్నారు. ఇండస్ట్రీ ఎక్స్పోజర్‌ కావాలని, అలుమ్ని మొత్తం కాలేజీతో ఉండాలని సూచించారు. వారి కంట్రిబ్యూషన్‌ వృథా కాదన్నారు. విశ్రాంత, కళాశాల ప్రథమ ప్రిన్సిపాల్‌ ఆచార్య పరమేశ్వర్‌ మాట్లాడుతూ ఎంతోమంది గొప్ప విద్యార్థులను అందించిందన్నారు. టీచింగ్‌ తన ప్రేరణ అన్నారు. మొదటి వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ వెంకట్రామయ్య కళాశాల అభివృద్ధిలో చూపిన చొరవ మరువలేనిన్నారు. తదనంతర వీసీ ఆచార్య జాఫర్‌ నిజాం, ఆచార్య వాసుదేవ్‌, ఆచార్య జయశంకర్‌ చాలా సహకరించి అభివృద్ది చేశారని ప్రతాప్‌రెడ్డి తెలిపారు. మొదటి ఏడు బ్యాచ్‌లు చాలా కష్టపడ్డాయన్నారు. విద్యార్థుల మైండ్‌సెట్‌, ఆటిట్యూడ్‌ మారాలన్నారు. అలాంటి వారిని మార్కెట్‌ కోరుకుంటుందన్నారు. ఆచార్య రామ్‌బహు మాట్లాడుతూ ఫార్మసీ రంగం ఎక్కువమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు. ముందుముందు ఇండియన్‌ ఫార్మసీ కాంగ్రెస్‌, మోద్యులర్‌ ల్యాబ్‌లు నిర్వహించాలన్నారు. గత వైభవాన్ని కొనసాగించాలని కోరారు. ఆచార్య ఎ.వి.ఎన్‌.అప్పారావు మాట్లాడుతూ ఫార్మసీ కళాశాలకు రుణ పడి ఉంటామన్నారు. ఆచార్య మల్లారెడ్డి మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులను చూసి గర్విస్తున్నామన్నారు. ఎంతోమంది అధికారులను ఫార్మసీ కళాశాల అందించిందన్నారు. ఆచార్య గాదె సమ్మయ్య తన అబివృద్ధికి తన అధ్యాపకుల సేవలను కొనియాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆచార్య బి.వెంకటరాంరెడ్డి మాట్లాడుతూ ఈ యూనివర్సిటీలో గొప్ప విభాగం ఫార్మసీ అన్నారు. రిజిస్ట్రార్‌ ఆచార్య వి.రామచంద్రం మాట్లాడుతూ విశ్వవిద్యాలయానికి వన్నె తెచ్చిన కళాశాల ఫార్మసీ అని అన్నారు. గొప్ప పరిశోధన అవకాశాలు ఉన్నాయన్నారు. పలువురు విశ్రాంత ఆచార్యులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
———————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *