కేయూ బడ్జెట్.. రూ.331 కోట్లతోప్రతిపాదన

 కాళోజీ జంక్షన్ /హన్మకొండ ప్రజాతంత్ర, మార్చి 30 : కాకతీయ విశ్వవిద్యాలయం 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి రూ. 331.99 కోట్లతో అంచనా బడ్జెట్ ను ప్రతిపాదించింది. సోమవారం ఉదయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన విశ్వవిద్యాలయ సెనెట్ హాల్ లో 41 వ అకడమిక్ సెనెట్ సమావేశం లో రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, అకాడమిక్ సెనెట్ సభ్యుల సమక్షంలో విశ్వవిద్యాలయ అర్థ శాస్త్ర విభాగ ఆచార్యులు, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్ విభాగాల డీన్, దూర విద్యాకేంద్ర సంచాలకులు, పాలక మండలి సభ్యులు ఆచార్య బి. సురేష్ లాల్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సంవత్సరం పాటు ఉద్యోగుల వేతనాలు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ లు, ఉద్యోగ విరమణ భత్యాలు, నిర్వహణ ఖర్చులు, పరీక్షలు, అబివృద్ధి కార్యక్రమాలకు, ఇతర ఖర్చులు కు రూపాయలు 355.90 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపం లో రూ. 205.47 కోట్లు కాగ ఇతర వనరులు నుంచి రూ.126.52 కోట్లు రాబడి అంచనా వేసారు. వీటిలో ఉన్నత విద్యా మండలి నుంచి సెమినార్ ల నిమిత్తం 10 లక్షలు, ఇతరాల నుంచి 15.50 లక్షలు, అకాడమిక్, ట్యుషన్ ఫీజు ల రూపం లో రూ. 8.33 కోట్లు, అంతర్గత వనరుల ద్వార రూ. 41.41 కోట్లు, ఇతర పద్దుల ద్వార 21.56 కోట్లు, పరిక్షల విభాగం నుంచి 49.64 కోట్లు ముఖ్యంగా రానున్నాయి. ఖర్చులను, రాబడులను ఆచార్య సురేష్ లాల్ 8 అంశాల్లో చూపించారు. అదే సమయం లో రూ. 2.16 కోట్లు లోటు ఉంటుంది అని వెల్లడించారు. ఉద్యోగుల జీతాలకు, పెన్షన్ లకు రూపాయలు 169.96 కోట్లు, నిర్వహణ కు కార్యక్రమాలకు 10.34 కోట్లు, పరిక్షలు కు 54.88 కోట్లు, అకాడమిక్ కార్యక్రమాలకు 13.68 కోట్లు, అబివృద్ధి కార్యక్రమాలకు 97.44 కోట్లు, అప్పులు ఇతరాలకు 1.75 కోట్లు, కరువు బత్యానికి 8.40 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలిపారు. వైస్ ఛాన్సలర్ ఆచార్య కే.ప్రతాప్ రెడ్డి తన రిపోర్ట్ లో విశ్వవిద్యాలయ అబివృద్ధి లో అందరి కృషి ఉందన్నారు. బాధ్యత తో విశ్వవిద్యాలయాని ముందుకు తీసుకోని వేల్లుతున్నాం అన్నారు. 2026 లో విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవ సంవత్సరం లోనికి అడుగు పెట్టిందన్నారు. ఆ సందర్భంగా గోల్డెన్ జూబిలీ లో భాగంగా జరుగుతున్నాయన్నారు. నూతన కోర్స్ లు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా తీసుకోని వస్తామని, విద్యార్థులను ఉద్యోగార్ధులు గా చేయటమే లక్ష్యం సిలబస్ రూపకల్పన, కృత్రిమ మేధా, క్వాంటం టెక్నాలజీ పొందుపరుస్తునట్టు చెప్పారు. డొమైన్ విజ్ఞానం తో పాటు సాఫ్ట్ స్కిల్ల్స్ పై దృష్టి వేడుతునట్టు, క్రెడిట్ పాలసీ లను కుడా అందుబాటులో తెస్తున్నట్టు పేర్కొన్నారు. ముఖ గుర్తింపు కూడా విభాగాలలో విద్యార్థులకు, హాస్టల్ లో మెస్ కు కుడా తీసుకోని వస్తునట్టు, విద్యార్థులు మానసిక స్థితి కి తోడుగా “చేతనా” సెంటర్ ను నెలకొల్పినట్టు చెప్పారు. లైబ్రరీ కి నిధులు పెంచుతునట్టు, 23 వ స్నాతకోత్సవం, తెలంగాణా సైన్సు కాంగ్రెస్, హిస్టరీ కాంగ్రెస్, మహిళా సాధికారత పై సదస్సు లు నిర్వహించినట్టు తెలిపారు, ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబిలీ లో బాగంగా, విశ్వవిద్యాలయం గోల్డెన్ జూబిలీ సంవత్సరం పురస్కరించుకొని పూర్వ విద్యార్థులు 4 స్మారక ఉపన్యాసాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరిశోధన ను పెంపు ప్రోత్సహించటానికి వైస్ ఛాన్సలర్ అవార్డు లను ప్రకటిస్తునట్టు చెప్పారు. అకాడమిక్, టీచింగ్ పెంపు కు ప్రొఫెసర్ అఫ్ ప్రాక్టీసు ను తీసుకోని వస్తునట్టు, వీటికి పాలక మండలి ఆమోదం కూడా వచ్చినట్టు వివరించారు. అధ్యాపకులకు పెండింగ్ లో కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం ప్రమోషన్ లు ఇచ్చినట్టు, బోధనేతర సిబ్బంది కి 4 డిప్యూటీ రిజిస్ట్రార్ లు ఇచ్చినట్టు వెల్లడించారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ నుంచి ఇతర పోస్టులకు ప్రాసెస్ ను ప్రారంభించినట్టు, 130 పార్ట్ టైం నియామకాలు చేపడుత్నట్టు తెలిపారు. రుసా నిధులు 70 శాతం వరకు వెచ్చించినట్టు, అందులో భాగంగా 5 రీసెర్చ్ సెంటర్ లు, 42 వ్యక్తిగత ప్రాజెక్ట్ లు, 74 మంది ప్రాజెక్ట్ ఫెలో లు గా నియామకాలు చేసినట్టు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ కే. హబ్ ను హైదరాబాద్ లోని టి. హబ్ లా మార్చటానికి ఏర్పాట్లు చేసినట్టు, ఆ దీశగా విద్యార్థులకు టి. హబ్ ప్రతినిదుల తో అవగాహనా, ప్రేరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన 1200 మంది విద్యర్తులల్లో 250 మంది ని ఎంపిక చేసినట్టు చెప్పారు. వీరి ద్వార 100 కు పైగా స్టార్ట్ అప్ లు వస్తాయని ఆశాబావం వ్యక్తం చేసారు. యూనివర్సిటీ పరీక్షల ముల్యంకనం అన్ లైన్ లో, ఆఫీస్ ఆటో మేషన్, పరిక్షల విభాగం డిజిటలికరణ, మహిళకోసం హాస్టల్ లు, కాంపస్ లో సి సి కెమెరా లు, ఇంటర్ నెట్ వ్యవస్థ ఆధునికరణ కోసం బి.ఎస్. ఎన్.ఎల్ తో ఒప్పందాలు, యూనివర్సిటీ గోల్డెన్ జూబిలీ, ఆర్ట్స్ కళాశాల శతాబ్ధి సందర్భంగా అబివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన కు ప్రభుత్వానికి డిటైల్డ్ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. హాస్టల్ లో లోటు పాట్లు, తప్పులు జరుగకుండా హాస్టల్ మేనేజ్మెంట్ సిస్టం తీసుకొని వస్తునట్టు చెప్పారు. అధ్యాపకుల పనిని మానిటర్ చేస్తామని , 2029 న్యాక్ అక్రిడేషన్ కోసం ఇప్పటినుంచే ప్రణాళికలు రుపొందిస్తునట్టు వెల్లడించారు. మీడియా విశ్వవిద్యాలయ అబివృద్దికి సానుకూలంగా స్పందిచాలన్నారు. విశ్వవిద్యాలయం లో ఉన్న సెంటర్ లను బలోపేతం చేస్తామని చెప్పారు. అదే విధంగా సెల్ట్ తరగతులు తప్పనిసరి చేస్తామని అన్నారు. బడ్జెట్ పై అబిప్రాయం చెపుతూ మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య విద్యావతి మాట్లాడుతూ “ఉద్యోగుల లో నిబద్దత పెరగాలన్నారు. చాల ఏళ్ల నుంచి ఒప్పంద అధ్యాపకులు గా ఉన్న వారు ఉన్నారు అని, విద్యార్ధి కేంద్రం గా విశ్వవిద్యాలయం ఉండాలి అన్నారు. వివిధ సెల్ లను బలోపేతం చేయాలనీ, నియామకాలు జరగాలన్నారు. ఆచార్య ఆర్. సాయన్న మాట్లాడుతూ యూనివర్సిటీ చాల అబివృద్ధి చెందింది అని, మరింత అబివృద్ధి కి ఆస్కారం ఉందన్నారు. ఆచార్య బి. వెంకటరత్నం మాట్లాడుతూ యూనివర్సిటీ గోల్డెన్ జూబిలీ లో అడిగిడటం, ఆర్ట్స్ కాలేజీ శతాబ్ది లో అడిగిడటం అబినందనియం అన్నారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులను యూనివర్సిటీ అందించిందన్నారు. భారత ప్రధాని పి.వి. నరసింహ రావు ను అందించింది అని, అబివృద్ధి నిధులు పెరగాలి అని, యూనివర్సిటీ నిర్మాణం లో, అబివృద్ధి లో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యోగి గొప్ప వారు అని అన్నారు. పాలక మండలి సభ్యులు పుల్లూరు సుధాకర్ మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు పెరగాలంటే నిధుల అవసరమన్నారు. వాస్తవానికి దగ్గర గా బడ్జెట్ ఉండాలన్నారు. అకాడమిక్ సెనెట్ సభ్యులు డాక్టర్ అంపశయ్య నవీన్ మాట్లాడుతూ లైబ్రరి కి నిధులు పెంచటం, విశ్వవిద్యాలయ విద్యార్థులకు కౌన్సిలింగ్ కోసం “చేతన” సంస్థను ప్రారంభించటం అభినందనీయమన్నారు. ఎడ్యుకేషన్ విభాగ డీన్ విశ్రాంత ఆచార్యులు ఆచార్య ఎన్. రామనాధ కిషన్ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభం లో మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎన్. లింగమూర్తి మృతికి రెండు నిముషాలు మౌనం పాటించారు. స్టాండింగ్ కమిటీ అఫ్ అకాడమిక్ సెనెట్ ను, వార్షిక నివేదికలను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సమావేశంలో పాలక మండలి సభ్యులు డాక్టర్ బి.రమ, డాక్టర్ ఎన్.సుదర్శన్, డాక్టర్ చిర్రా రాజు, ఆచార్య ఎం.నవీన్, డాక్టర్ బి.సుకుమారితో పాటు డీన్ లు ఆచార్య రాజేందర్ కట్ల, ఆచార్య ఎన్. ప్రసాద్, ఆచార్య ఎం.సదానందం, ప్రిన్సిపాల్ లు ఆచార్య టి. మనోహర్, ఆచార్య జ.కృష్ణవేణి, ఆచార్య ఎన్. రమణ, ఆచార్య కే. భిక్షాలు, ఆచార్య ఎస్.జ్యోతి, డాక్టర్ భాస్కర్, డాక్టర్ నల్లాని శ్రీనివాస్, డాక్టర్ గోపి, డాక్టర్ బి.ఎస్.ఎల్. సోజన్య, అకాడమిక్ సెనెట్ సభ్యులు గొల్లపూడి జగదీశ్, మాణిక్యం పాల్గొన్నారు, ఫైనాన్సు ఆఫీసర్ డాక్టర్ మహమ్మద్ హబీబ్ద్దిన్, లింగంపల్లి రాము, ప్రణయ కుమార్, ఆర్. శ్రీలత దేవి, తో పాటు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
————————————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *