యూరియా కోసం రైతులు ఆగ‌మాగం

~ అందుకే ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో పాల్గొన‌డంలేదు
~ బీఆర్ ఎస్ నేత కేటీఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8: లక్షల మంది తెలంగాణ రైతులు యూరియా కోసం క్యూ లైన్ లలో ఆగమాగం అవుతున్నారు. తెలంగాణ రైతుల గోస తీర్చాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాం. యూరియా కొరతపై 20 రోజుల క్రితం హెచ్చరించి అప్రమత్తం చేసినా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ స్పందించలేదు. ఉపరాష్ట్రపతి అభ్యర్థులు ఇద్దరు కూడా ఎన్డీఏ, ఇండియా కూటముల ప్రతినిధులు. వాళ్ళు వ్యక్తులుగా పోటీ చేయడం లేదు. ఆయా కూటముల తరఫున పోటీ చేస్తున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బిజెపి ఈ రాష్ట్ర రైతులను వేధిస్తున్నాయి. సతాయిస్తున్నాయి. ప్రాణాలు తీస్తున్నాయి. అందుకే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకూడదనే నిర్ణయాన్ని 71 లక్షల మంది తెలంగాణ రైతన్నల తరఫున తీసుకున్నాం. నోటా ఉంటే దానికే వేసేవాళ్లం. లేదు కాబట్టే ఎన్నికల్లో పాల్గొనడం లేదన్నారు. మహారాష్ట్ర పోలీసులు వచ్చి రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ ను పట్టుకుంటే తెలంగాణ పోలీసులు, ఇంటలిజెన్స్, ఈగిల్, హైడ్రాలు ఏం చేస్తున్నాయి?   రూ.12 వేల కోట్ల డ్రగ్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ కు ముడుపులు ముట్టాయా? అందుకే తెలంగాణ పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరించారా? అని ప్ర‌శ్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఇంకా విచారణ అవసరం లేదని స్ప‌ష్టం చేశారు. పిసీసీ ప్రెసిడెంట్ , కడియం శ్రీహరి అప్రూవర్ లుగా మారి నేరాన్ని అంగీకరించారని గుర్తుచేశారు. స్పీకర్ వెంటనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని డిమాండ్ చేశారు.  ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు స్వయంగా పీసీసీ అధ్య‌క్షుడు ఓ టీవీ చర్చలో ఒప్పుకున్నాడు. కడియం శ్రీహరి కూడా తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఒప్పుకున్నారు. నేరాంగీకారం జరిగిన తర్వాత ఇంకా విచారణ ఎందుకు ? వేటు వేయాల్సిందేన‌ని డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *