– అందెశ్రీ మృతికి కేటీఆర్ సంతాపం
– ఆయన పార్థివ దేహానికి నివాళులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10: అందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి, సాహిత్యానికి తీరని లోటు అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన ఆకస్మిక మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. కాగా, లాలాపేట్‌లోని స్టేడియంలో ఉంచిన అందెశ్రీ పార్థివ దేహానికి కేటీఆర్ నివాళులర్పించారు. పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు ఆయన వెంట ఉన్నారు. అందెశ్రీ సేవలు, రచనలు, పాటలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కేటీఆర్ అన్నారు. ఆయన మరణించారు అని పద్మారావు గౌడ్ చెప్పగానే వెంటనే అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని వచ్చానన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





