కార్యకర్తలకు కేటీఆర్‌ ‌కృతజ్ఞతలు

– కేసీఆర్‌కు మద్దతుగా ఆం‌దోళనలు చేసినందుకు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వరి 2 : ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర‌ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్‌ ‌విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేప‌ట్టాయి. తమ అధినేతకు మద్దతుగా కార్యకర్తలు గ్రామ‌గ్రామాన క‌దం తొక్కారు. ఎక్కడికక్కడ సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను ద‌గ్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళ‌నలు చేసిన కార్యకర్తలకు పార్టీ వ‌ర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌కృతజ్ఞతలు తెలియజేశారు. నిన్న ఉదయం నుంచే గ్రామగ్రామాన గర్జించిన కార్యకర్తలకు, సోషల్ ‌మీడియాలో మద్దతుగా నిలిచిన వారియర్‌లకు, ప్రతి పట్టణంలో మోటర్‌ ‌సైకిల్‌ ‌ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలతో హోరెత్తించి ఈ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా గొప్పగా పోరాడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని కేటీఆర్‌ ‌ఎక్స్ ‌ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *