– బీఆర్ ఎస్ సిరిసిల్ల నియోజకవర్గ సమావేశంలో కెటిఆర్
కరీంనగర్, ప్రజాతంత్ర, జూలై 17: జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో సిరిసిల్ల నియోజకవర్గం లోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల, నాయకులు ప్రజాప్రతినిధుల తో స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై నాయకులకు దిషానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతున్నదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేరు. ఎన్నికల ముందు కాంగ్రెసోళ్ల కుడా గేలుస్తామని అనుకోలేదు, అనుకోకుండా వచ్చిన అధికారంతో వాళ్ళు ఆగం అయితున్నారు, మనల్ని ఆగం చేస్తున్నారు. బనకచర్ల మీటింగ్ అయితే ముఖ్యమంత్రి హాజరు కా వారి కార్యాలయం ప్రకటించిన తరువాత కొద్దిసేపటికే ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బనకచర్ల పై రేవంత్ రెడ్డి అంగీకరించినట్టుప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల దుకాణాల ముందు చెప్పులు పెట్టీ క్యూలో నిల్చునే రోజులు మళ్ళీ వచ్చాయి. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం అనేక ప్రాజెక్టులు, 15, రిజర్వాయర్లు ఉన్నాయి, 3బ్యారేజ్ లు, 21 పంపింగ్ సెట్ లు ఉన్నాయి. కొండ పోచమ్మ సాగర్ వద్ద 618 మీటర్ల ఎత్తుకు కేసీఆర్ నీళ్లు తెచ్చిండు. ఒక్కో మోటార్ 139మెగావాట్ల బాహుబలి మోటార్లతో ఎత్తిపోతల ద్వారా మనకు నీటి సరఫరా వ్యవస్థ తయారు చేసిండు. 24గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమాతో వ్యవసాయ భూముల ధరలు పెరిగాయి. కాంగ్రెస్ హయంలో రూ.3 లక్షలున్న ధర, కేసీఆర్ నిర్ణయాలతో ఎకరానికి దాదాపు రూ30లక్షలు అయ్యాయి. కేసీఆర్ ఇచ్చిన హామీల లో ఒకటికి రెండింతలు ఇస్తామని అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు , మెదక్ లో ఓ నాయకుడు ఏకంగా 48 గంటలు కరెంటు ఇస్తా హామీ ఇచ్చిండు. కల్యాణలక్ష్మి పథకం తో ఆడబిడ్డల వివాహానికి అండగా నిలిచింది కేసీఆర్అ . ధికారం ఎవరికి శాశ్వతం కాదు. నేను సిరిసిల్లకు వస్తే చాలా సంతోషపడతాను. పరిపాలన పరంగా ఇక్కడ జరిగిన అభివృద్ధి చరిత్రాత్మకం. 2001 నుండి ఇప్పటివరకు మనకు సిరిసిల్ల లో ఏ ఎన్నికైన తిరుగులేదు. ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటా. మన ఎంపీటీసీ కుంటయ మరణం నన్ను తీవ్రంగా బాధించింది, వారికి కుటుంబ బాధ్యత నేను తీసుకున్న .ప్రజలంతా కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ఎవ్వరికి భయపడేది లేదు, మనల్ని ఇబ్బంది పెడుతున్న అందరి పేర్లు రాసిపెట్టుకుంటున్న. మన పార్టీ నుండి పోయిన నాయకులు, ఎమ్మెల్యేలు మళ్ళీ వస్తానంటూ రాయభారం చేస్తున్నారు, వాళ్ళని తీసుకోవద్దని కేసీఆర్ ఖరాఖండిగా చెప్పారు. ప్రతి ఎంపీటీసీ , జడ్పీటీసీ, అన్ని స్థానాల్లో మనమే గెలవాలి. రాష్ట్రంలోని 269 జడ్పీటీసీ స్థానాల్లో మనం గెలవబోతున్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజాశక్తి కి భయపడాల్సిదే. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి స్థానం కోసం పోటీ నడుస్తుంది. గ్రామాల్లో యూరియా కొరత ఉంది, దీంతో పాటు అనేక సమస్యలు ఉన్నాయి మీరు స్థానిక ఆయా సమస్యలపై కోట్లాడండి . మన ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకు అనేక అవార్డులు వస్తె నేడు ఒక్క అవార్డు దిక్కులేదు . జీవితం చాలా చిన్నది, ప్రజా సమస్యలపై పోరాటం చేద్దాం. బిసి రిజర్వేషన్లపై బీసీ సోదరులను మళ్ళీ కాంగ్రెస్ మోసం చేస్తుంది. పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. బీసీలకు లక్ష కోట్లు బడ్జెట్ పెడతా అన్నాడు అనేక హామీలు ఇచ్చిండు . బండి సంజయ్ బిసి రిజర్వేషన్ల నుండి ముస్లింలను తీసేయాలంటాడు. జన గణన తో పాటు కుల గణన చేసి అమలుచేయాలి . రాష్ట్రంలో మనమే ప్రధాన ప్రతిపక్షం , బిసి డిక్లరేషన్ పై మనమే అందరికీ అవగాహన కల్పించాలన్నారు.



