అంబేడ్కర్‌ ఆలోచనా విధానాలే దేశానికి శ్రీరామరక్ష

ఆయన చూపిన మార్గంలోనే తెలంగాణ సాకారం

దళితులకు అభయహస్తం ఎప్పుడిస్తారో చెప్పాలి

బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌డిమాండ్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : ‌కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు డాక్టర్‌ ‌బీఆర్‌ అంబేడ్కర్ ఆలోచనలే కారణమని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. ఆధునిక భారతావనికి పునాదులు వేశారని తెలిపారు. బాబాసాహెబ్‌ ఆలోచన, ముందు చూపు చాలా గొప్పదని వెల్లడించారు. ఆయన వల్లనే తెలంగాణ కల సాకారమయ్యిందని అన్నారు. దేశంలో అందరూ బాగుండాలన్నదే అంబేడ్కర్ ఆలోచన అని చెప్పారు. అంబేడ్కర్ ఆలోచనను కేసీఆర్‌ ఆచరణలో పెట్టారన్నారు. దళితబంధు లాంటి పథకాన్ని అమలు చేసిన దమ్మున్న నాయకుడు కేసీఆర్‌ అన్నారు. అబద్ధపు ప్రచారంతో ప్రజలను కాంగ్రెస్‌ ‌పార్టీ మోసం చేస్తున్నదని, దళితులకు అంబేద్కర్‌ అభయహస్తం ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. రూ.12 లక్షల కాదుకదా.. 12 రూపాయలు కూడా ఇవ్వరని విమర్శించారు. హైదరాబాద్‌ ‌తెలంగాణ భవన్‌లో బీఆర్‌ అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్‌.. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అంబేడ్కర్ ఆలోచనలే కారణమన్నారు. ప్రజాస్వామ్యంలో మందబలంతో అవతలివారి గొంతు నొక్కేయడం ఉండకూడదని అందరితో కొట్లాడి కొత్త రాష్టాల్ర ఏర్పాటుకు ఉన్న రాష్ట్రం అనుమతి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంటూ రాజ్యాంగంలో ఆర్టికల్‌ 3‌ని పొందుపర్చా రన్నారు. మనం ఇప్పుడు తెలంగాణలో మాట్లాడుతున్నామంటే దానికి కారకుడు ఒకేఒక్కరు డాక్టర్‌ ‌బాబా సాహెబ్‌ అంబేడ్కర్ అని చెప్పారు. బాబాసాహెబ్‌ ఆలోచన, ముందు చూపు చాలా గొప్పదన్నారు.

అంబేడ్కర్ ను కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమని, దళిత బిడ్డ కాబట్టి దళిత జాతికి మాత్రమే నాయకుడు అన్నట్టుగా కొందరు ఆయనను తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు. స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ, జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ, వారితోపాటు కొట్లాడిన వేలాది లక్షలాది మంది ఎలాగైతే కీలకపాత్ర పోషించారో, స్వాతంత్యాన్రంతరం ఆధునిక భారతావనికి పునాది వేసిన అద్భుతమైన నాయకుడు అంబేడ్కర్. ‌దేశానికి స్వతంత్రం వొచ్చినప్పుడు చిన్న చిన్న రాష్టాల్రు ఉండేవి. ఎన్ని భాషలు, మతాలు, కులాలు, ఉపకులాలు, సంప్రదాయాలు ఉండేవి. నలుగురు కలిసి ఉండటం కష్టం. ఇన్ని వైవిధ్యాలున్న ఈ దేశాన్ని శాశ్వతంగా సుదీర్ఘ కాలం కలిసి ఉండాలంటే ఏం చేయాలని అంబేడ్కర్, ‌డాక్టర్‌ ‌ఫజల్‌ అలీ వంటి మేధావులు ఆలోచించి భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు ఆలోచన చేశారు.

ఆ సమయంలోనే ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలనేది మంచి ఆలోచనే, కానీ కచ్చితంగా ఒక భాషకు ఒక రాష్ట్రం ఉండాలనడం తప్పు. ఒక భాషకు నాలుగైదు రాష్ట్రాలు ఉండొచ్చు. పరిపాలనా సౌలభ్యం చిన్న రాష్ట్రాలు ఉంటే తప్పులేదని ఆలోచన చేసిన నాయకుడు బాబాసాహెబ్‌ అంబేడ్కర్. ‌నాడు అంబేడ్కర్ నాయకత్వంలో రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలనే మనం పాటిస్తున్నాం. 78 ఏండ్ల తర్వాత కూడా రాజ్యాంగమే మనలను కాపాడుతున్నది.

అంబేద్కర్‌ ‌నమ్మిన సిద్దాంతం బోధించు, సకరించు, పోరాడు అనే తత్వాన్ని అర్థం చేసుకుని, ఆచరణలో పెట్టిందే కేసీఆర్‌. ‌పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి లక్షల సంఖ్యలో ప్రజలను అసకరిస్తూ, వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ, వివరిస్తూ, తెలంగాణకు అన్యాయం జరిగితే పోరాడుతూ రాజ్యంగం ఆధారంగా రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్‌. బిఆర్‌ఎస్‌ ‌హయాంలో ప్రభుత్వంలో వేలాది మంది పిల్లలను అమెరికా పంపించాం, లక్షలాది పిల్లలను పటిష్టమైన పునాదివేశాం. 1022 పాఠశాలలు పెట్టి, ఒక్కో విద్యార్థిపై నెలకు రూ.10 వేలు, సంవత్సరానికి లక్షా 25 వేలు ఖర్చుపెట్టి ప్రపంచంతో పోటీ- పడేలా తయారుచేసి అంబేద్కర్‌ ఆలోచనను కేసీఆర్‌ ఆచరణలో పెట్టిన నాయకుడు కేసీఆర్‌. ‌గురుకులాలు మాత్రమే కాదు, పదేండ్ల కాలంలో 7 వేల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇచ్చి విదేశి విద్య అభ్యసించడానికి తెలంగాణ నుంచి పంపించాం. దళితబంధు పథకంతో లక్షలాది మంది జీవితాలను మార్చలేకపోవచ్చు. కేసీఆర్‌ ‌లాంటి నాయకుడి చేతిలో అపరిమితమైన వనరులు ఉంటే చాలా చేస్తుండే. కానీ పరిమితమైన వనరులతో ఉన్నంతలో ఏడాదికి ఇన్ని వేలమందికి అని దళితబంధు పథకం తెచ్చాం. దానికి విపరీత అర్ధాలు తీసి కొందరు చిల్లరగాళ్లు రాజకీయ లబ్ధి పొందొచ్చు.

కానీ దళితబంధులాంటి పథకం ప్రవేశపెట్టినందుకు కేసీఆర్‌ ‌సైనికుడిగా గర్వపడుతున్నా. అంబేడ్కర్ ‌పేరు వాడుకుని మోసం చేసిన కాంగ్రెస్‌ ‌పార్టీని అడగాలి. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్‌ ‌పేరుతో దళితులకు రూ.12 లక్షలు ఇస్తామని చేవెళ్లలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చెప్పించారు. ఇప్పుడు రేవంత్‌ ‌రెడ్డిని అడుగుతున్నా రెండు బడ్జెట్లు- పెట్టినవ్‌. ఇం‌కెప్పుడిస్తావు. అంబేడ్కర్ అభయ హస్తం. రూ.12 లక్షలు కాదుకదా రూ.12 కూడా ఇవ్వడని అందరికీ అర్థమైపోయింది. డబుల్‌ ‌బెడ్‌రూమ్‌ ‌పథకం కింద ఎస్సీ ఎస్టీలకు రూ.6 లక్ష ఇస్తానని చెప్పిండు.

బాబాసాహెబ్‌ ‌జయంతి సందర్భంగా నీ రూ.6 లక్షల మాట ఏమైందని అడుగుతున్నా. ఖర్గే ఎక్కడున్నడు, రాహుల్‌ ‌గాంధీ ఎక్కడున్నాడు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో రు చెప్పిన కథలన్నీ ఏమైనయ్‌. ఎస్సీ, ఎస్టీలకు 28 శాతం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వాటా కలిపిస్తామని చెప్పారు.. ఇకెందుకు చేయలేదు రేవంత్‌ ‌రెడ్డి?. అసైన్డ్ ‌భూములకు పట్టాలు ఇస్తామని చెప్పిన హా ఏమైంది?. ఎస్సీ, ఎస్టీలకు విద్యాజ్యోతిల పథకం కింద 10వ తరగతి పాస్‌ అయితే రూ.10 వేలు, ఇంటర్‌ ‌పాస్‌ అయితే రూ.15 వేలు, గ్రాడ్యుయేషన్‌ ‌పూర్తి చేస్తే రూ.25 వేలు, పీజీ చేస్తే లక్ష, పీహెచ్డీలు చేస్తే రూ.5 లక్షలు ఇస్తామన్నారు.. ఏమైందని నేడు అడుగుతున్నా. రేవంత్‌ ‌రెడ్డి దళిత సమాజానికి, ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మోదీ ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వం. పేదలకు రూ.2000 పెన్షన్‌ ఇస్తే, రుణమాఫీ చేస్తే, ఉచిత కరెంట్‌ ఇస్తే మోడీకి నచ్చదు కానీ రూ.16.50 లక్షల కోట్లు- పెద్ద పెద్ద కార్పొరేట్లకు మాఫీ చేస్తే మోదీకి నచ్చుతుంది. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తుఫాన్‌ ‌వేగంతో అధికారంలోకి వస్తుందని కేటీఆర్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *