ఫోన్‌ ‌ట్యాపింగ్‌.. ముగిసిన కేటీఆర్‌ ‌విచారణ

– 7 గంటలకుపైగా పలు రకాల ప్రశ్నలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి23: ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విచారణ ముగిసింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి దాదాపు 7 గంటలపాటు జూబ్లీహిల్స్ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో సిట్‌ అధికారులు ఆయనను ప్రశ్నించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి వొచ్చిన విరాళాలు, ఎలక్టోరల్‌ ‌బాండ్లు.. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో కొందరు వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి కేటీఆర్‌పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. అలాగే ఈ కేసులో నిందితుడు, టాస్క్‌ఫోర్స్ ‌మాజీ డీసీపీ రాధాకిషన్‌ ‌రావు, కేటీఆర్‌ను కలిపి గంట పాటు విచారణ చేసినట్లు సమాచారం.  సిట్‌ ‌విచారణ అనంతరం కేటీఆర్‌ ‌నేరుగా తెలంగాణ భవన్‌కు వెళ్లారు. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో బీఆర్‌ఎస్‌ అ‌గ్రనేతలు హరీష్‌ ‌రావు, కేటీఆర్‌ ‌విచారణ ముగియడంతో  తదుపరి వంతు కేసీఆర్‌దేనని రాజకీయవరగాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సంచలనం సృష్టించిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌కు  22  సిట్‌ ‌నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జూబ్లీహిల్స్ ‌నందినగర్‌లోని కేటీఆర్‌ ‌నివాసానికి వెళ్లి అధికారులు నోటీసులు అందజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *