మా అయ్య తెలంగాణ తెచ్చిన మొనగాడు

– ఆయన పేరు బరాబర్‌ చెప్పుకుంటా
– రేవంత్‌ రెడ్డి చిట్టినాయుడు కాదు.. భీమవరం బుల్లోడు
– దిల్లీకి సంచులు మోసి పదవి కాపాడుకోవడం కాదు
– ఇచ్చిన హావిూలను అమలు చేసి చూపాలి
– సీిఎం రేవంత్‌కు కేటీఆర్‌ సవాల్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: కేసీఆర్‌ ఒక్క ప్రెస్‌విూట్‌కే సీఎం రేవంత్‌ రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని, ఇక ఆయన అసెంబ్లీకి వస్తే రేవంత్‌ గుండె ఆగి చస్తాడని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. అల్విన్‌ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు దోసల అనిల్‌ తెలంగాణ భవన్‌లో శుక్రవారం బీఆర్‌ఎస్‌లో చేరగా ఆయనకు కేటీఆర్‌ గులాబీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా అయ్య మొగోడు.. తెలంగాణ తెచ్చిన మొనగాడు.. ఆయన పేరు బరాబర్‌ చెప్పుకుంటా అని స్పష్టం చేశారు. నీ లెక్క సంచులు మోసుకుంటే నీ పిల్లలు చెప్పుకోరు అని విమర్శించారు. రేవంత్‌ రెడ్డిని కొడంగల్‌లో ఎమ్మెల్యేగా గెలవకుండా చేసే బాధ్యత మాది అని వ్యాఖ్యానించారు. రేవంత్‌ రెడ్డి భాషను చూస్తే పిల్లలు నేర్చుకునే పరిస్థితి ఉందన్నారు. నేను గుంటూరులో చదువుకుంటే నీకేం బాధ అని ప్రశ్నించారు. నేను హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్‌ భాష నేర్చుకున్నా.. నువ్వు కూడా నేర్చుకో అని అన్నారు. నీ అల్లుడు ఆంధ్రోడే కదా అంటూ రేవంత్‌ చిట్టినాయుడు కాదు భీమవరం బుల్లోడు అని ఎద్దేవా చేశారు. పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్‌ను వెనక్కి పంపితే ఏం చేస్తున్నావని కేసీఆర్‌ అడిగారు.. 10 శాతం పనులు పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలని, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని అడిగారు.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. హావిూలు అమలు చేయమంటే రేవంత్‌ రెడ్డికి కోపమొస్తుందంటూ ఆయన ఎనుముల రేవంత్‌ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్‌ రెడ్డి అని కేటీఆర్‌ విమర్శించారు. ఎన్నికలకు ముందు కల్యాణలక్షి కింద ఆడబిడ్డల పెళ్లికి రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తానని సోనియాగాంధీ విూద ఒట్టు వేశాడని, మహిళలకు రూ.2500 ఇస్తానని ప్రియాంక గాంధీ విూద ఒట్టు వేశాడని గుర్తు చేశారు. ఇవన్నీ ఎగవేసి ఇప్పుడు కోటిమంది మహిళలను కోటీశ్వర్లను చేస్తానంటున్నాడని మండిపడ్డారు. అలా చేయాలంటే బ్జడెట్‌ సరిపోతుందా అని ప్రశ్నించారు. బ్యాగులు మోసి జైలు కెళ్లి పేమెంట్‌ కోటాలో ముఖ్యమంత్రి అయ్యాడని, దిల్లీకి సంచులు మోసి పదవులు కాపాడుకుంటున్నాడని రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ సెటైర్లు వేశారు. మహిళలకు ఇస్తానన్న రూ.2500 ఎక్కడకు పోయాయని అడిగితే నీ గుడ్లు పీకి గోలీలు ఆడుకుంటా అంటున్నాడని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అడిగిటే నీ లాగుల తొండలు ఇడుస్తా అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను తిట్టాలనుకుంటే మూడు భాషల్లో పొల్లుపొల్లు తిడతానన్నారు. కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి ఇష్టారీతిన మొరుగుతున్నాడని, అమ్మా గీతమ్మ.. రేవంత్‌ రెడ్డిని కట్టెయ్‌.. లేదంటే ఎవరినన్న కరిచేలా ఉన్నాడని అన్నారు. కేసీఆర్‌ను మళ్లీ అధికారంలోకి రాకుండా చేస్తానని శపథం చేస్తున్నాడంటూ జనవరి 1 నుంచి మహిళలకు రూ.2500 ఇస్తానని శపథం చేయాలని రేవంత్‌కి సూచించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బీఆర్‌ఎస్‌లోనే ఉంటే అనిల్‌రెడ్డి పార్టీలో చేరినప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని గాంధీకి సవాలు విసిరారు. పేరులో గాంధీ ఉన్నా చేసేది భూకబ్జాలు అని విమర్శించారు. హైదరాబాద్‌ చరిత్రలో ఎవరితో సంబంధం లేకుండా బీఆర్‌ఎస్‌కు జీహెచ్‌ఎంసీ కార్పొరేషన్‌ను అప్పజెప్పారని, హైదరాబాద్‌లోని 23మంది ఎమ్మెల్యేలను గెలిపించారంటూ హైదరాబాద్‌ వాసులందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పి బీఆర్‌ఎస్‌కు 40శాతం సర్పంచ్‌లను ఇచ్చారన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సరైన నాయకులకు అవకాశమిస్తామని కేటీఆర్‌ తెలిపారు. కార్పొరేటర్లు గెలిస్తే కార్పొరేషన్‌ నిధులతో అభివృద్ధి చేసుకోవచ్చని, ప్రభుత్వంతో కొట్లాడి పనులు చేయిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కొడుకు భూకబ్జాలు చేస్తున్నాడని, ఆయనపై కేసు పెట్టిన అబీబుల్లాఖాన్‌ను బదిలీ చేశారని తెలిపారు. గన్‌ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ కూతురే స్వయంగా చెప్పిందని గుర్తు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *