జూబ్లీహిల్స్‌ను భ్రష్టుపట్టించిన కేటీఆర్‌ ‌

– ఆయ‌న‌ నాయకత్వంలో హరీష్‌ ‌పనిచేస్తారో లేదో..
– కాంగ్రెస్‌ ‌విజయంపై మంత్రి వివేక్‌ ‌వ్యాఖ్యలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 14: ఐటీ మంత్రిగా కేటీఆర్‌ ‌పదేళ్లు జూబ్లీహిల్స్‌ను భ్రష్టు పట్టించిండని కార్మిక శాఖ మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి విమర్శించారు. కేటీఆర్‌ ‌నాయకత్వంలో పనిచేయాలో లేదో హరీష్‌ ఆలోచించుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ‌విజయం పొందడంపై ఆయ‌న‌ ‌మాట్లాడారు. పదేళ్లలో జూబ్లీహిల్స్‌ను బీఆర్‌ఎస్‌ ‌పట్టించుకోలేదని, మున్సిపల్‌ ‌మంత్రిగా పదేళ్లు కేటీఆర్‌ ఏం ‌చేయలేదన్నారు. జూబ్లీహిల్స్ ‌ప్రజలకు మేం చేసిన‌ సంక్షేమం, అభివృద్ధిని ప్రచారం చేయడంతోపాటు బీఆర్‌ఎస్‌ ‌వైఫల్యాలను ప్రధానంగా వివరించామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ‌సోషల్‌ ‌మీడియాలో తప్పుడు ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ‌ప్రజలు సెంటిమెంట్‌కు కాకుండా అభివృద్ధికి పట్టం కట్టారని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలో జీహెచ్‌ఎం‌సీలో కాంగ్రెస్‌ ‌స్ట్రాంగ్‌గా అవుతుందన్నారు. బీజేపీ అయితే కనీసం పోటీలో కూడా లేదు.. జూబ్లీహిల్స్‌లో కమలం పార్టీ కనుమరుగైపోయింది.. ఆ పార్టీకి డిపాజిట్‌ కూడా దక్క‌లేదు అని అన్నారు. పోస్టల్‌ ‌బ్యాలెట్‌ ఓట్లతో సహా ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్‌ ‌స్పష్టమైన ఆధిక్యం కనబర్చడం కాంగ్రెస్‌ ‌పనతీరుకు నిదర్శనమని వివేక్‌ అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page