కేటీఆర్‌ వ్యాఖ్యలు అర్థం లేనివి

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: ఇండస్ట్రియల్‌ పాలసీపై కాంగ్రెస్‌ ప్రభుత్వం గురించి బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ అవస్తవాలు మాట్లాడుతున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు ఖండిరచారు. ఆయన చేస్తున్నది దుష్ప్రచారమన్నారు. లీజ్‌ భూములను ఫ్రీహోల్డ్‌ చేయాలని గత ప్రభుత్వంలో జీవోలు తెచ్చారని, ఆ భూములకు ఇన్ఫాక్ట్‌ ఫీజు కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చే ప్రయత్నం చేస్తోందని సెక్రటేరియట్‌లో మీడియా సమావేశంలో చెప్పారు. కేటీఆర్‌ చెప్పే 30శాతం భూమి విలువ కాదు కేవలం.. కన్వర్షన్‌ ఫీజు అన్నారు. ఫ్రీ హోల్డ్‌కు.. లీజు భూములకు సంబంధం లేకుండా కేటీఆర్‌ వ్యాఖ్యలు చేశారన్నారు. గత ప్రభుత్వంలో తెచ్చిన జీవోలను ఇప్పుడు అమలు చేస్తున్నామంటూ కేటీఆర్‌ వ్యాఖ్యలు అడ్డగోలుగా, సత్యదూరమైనవని అన్నారు. అవి బీఆర్‌ఎస్‌కే చెల్లుతాయన్నారు. కన్వర్షన్‌కు భూమికి లింక్‌ పెట్టి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో అనేక భూములు కన్వర్షన్‌ చేశారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా బీఆర్‌ఎస్‌ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. పరిశ్రమలు కావాలి అనుకునే వాళ్ళే దరఖాస్తు చేసుకోవచ్చు. కేటీఆర్‌ చెప్పిన పేర్లు కలిగిన వాళ్ళు ప్రభుత్వంలో లేరు. ఆ పేరు కలిగిన వాళ్ళు ఎంఓయూ చేసుకున్నట్లు నిరూపిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. జూబ్లీహిల్స్‌లో ఓడిపోయిన తర్వాత బీఆర్‌ఎస్‌కు పగలే చుక్కలు కనిపిస్తున్నాయన్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీ అవ్వకుండా బీఆర్‌ఎస్‌ అడ్డుపడుతోందంటూ సొంత భూములు ఉన్న వాళ్ళు కన్వర్షన్‌ చేసుకోవచ్చునన్నారు. కన్వర్షన్‌ వల్ల రూ.4వేల కోట్ల నుంచి రూ. 5వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *