– కాగ్ నివేదికపై కేటీఆర్ స్పందన
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11: కాంగ్రెస్ ప్రభుత్వం(congress government) ఏర్పడిన మూడు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఒక ప్రకటనలో విమర్శించారు. కాగ్ (CAG) నివేదికపై ఆయన స్పందిస్తూ రాష్ట్ర ఆదాయం పడిపోవటంతోపాటు అప్పులు భారీగా పెరిగాయన్నారు. ఆ నివేదికతో రేవంత్ ప్రభుత్వం అసమర్థత బయటపడిరదన్నారు. కాగ్ తైమ్రాసిక నివేదిక ప్రకారం రాష్ట్ర ఆదాయం బాగా తగ్గడం ప్రమాద ఘంటికను మోగిస్తోందన్నారు. రూ.2,738 కోట్ల మిగులు ఉండగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆరు గ్యారెంటీలంటూ హావిూలతో కాంగ్రెస్ ఆర్థిక రంగానికి నష్టం చేసిందన్నారు. ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకుండా, ఒక్క ప్రాజెక్టు కట్టకుండా, విద్యార్థులకు మంచి భోజనం పెట్టకుండా అప్పులతో ఏం చేస్తున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆదాయం తగ్గుతుంటే అప్పులు మాత్రం పెరుగుతున్నాయని, దీన్ని ఎలా గాడిన పెడతారో కాంగ్రెస్ ఆర్థిక నిపుణులు చెప్పగలరా అని నిలదీశారు.



