ట్యాపింగ్‌ ‌విషయాన్ని కేటీఆర్‌ అం‌గీకరించారు

– మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 24:ఫోన్‌ ‌ట్యాపింగ్‌ అనేది ఎన్నో ఏళ్లుగా ఉందని.. కానీ, కేసీఆర్‌ ‌హయాంలో మాత్రమే ఇది వివాదాస్పదమైందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. దేశ భద్రత కోసం చేయాల్సిన ట్యాపింగ్‌ ‌రాజకీయ స్వలాభం కోసం చేసిన ఘనులు కెసిఆర్‌ అన్నారు. అందుకే దీనిపై విచారణ జరపాల్సి వొచ్చిందన్నారు. మీడియా సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. నేతలు, వ్యాపారులు మాట్లాడుకున్నది కూడా దుర్మార్గంగా విన్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ‌పాలనలో ఫోన్లలో మాట్లాడేందుకు బీఆర్‌ఎస్‌ ‌నేతలే భయపడేవారని మంత్రి అన్నారు.  ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌చేస్తే.. చేసి ఉండొచ్చని స్వయంగా కేటీఆర్‌ అం‌గీకరించారు. ఈ కేసులో ఆయన్ను కేవలం సాక్షిగానే విచారణకు పిలిచారు. రాజకీయ కక్ష సాధించాలనుకుంటే ఇప్పటికే కేసీఆర్‌, ‌కేటీఆర్‌ అరెస్టు అయ్యేవాళ్ళని మంత్రి జూపల్లి అన్నారు.

కుటుంబ సభ్యుల ఫోన్లూ ట్యాప్ : మంత్రి వివేక్‌

మంచిర్యాల: సొంత  చెల్లె కవిత, బావ హరీష్‌ ‌రావు, తండ్రి కేసీఆర్‌ ‌ఫోన్లను కూడా కేటీఆర్‌  ‌ట్యాపింగ్‌ ‌చేయించారని మంత్రి వివేక్‌ ఆరోపించారు.  ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌చేశారని మండిపడ్డారు. చెన్నూరు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్‌ ‌కుమార్‌ ‌దీపక్‌ ‌తో కలిసి శంకుస్థాపన చేశారు.  సుమారు కోటి 25 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన.. కేటీఆర్‌,‌కేసీఆర్‌ ‌రిటైర్డ్ ‌పోలీస్‌ అధికారులతో ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌లకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఫైర్‌ అయ్యారు. కాళేశ్వరం, మిషన్‌ ‌భగీరథ కుంభకోణాల్లో కోట్ల రూపాయల దండుకొని పేద ప్రజల నడ్డి విరిచారని విమర్శించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎనికల్లో ఇచ్చిన ఆరు  గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. చెన్నూరు మున్సిపాలిటీనీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని వివేక్‌ చెప్పారు. సుమారు రూ.500 కోట్ల నిధులతో మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, సైడ్‌ ‌డ్రైన్‌ ‌పనులు చేస్తున్నామన్నారు. కోల్‌ ‌బ్లాక్‌ ‌టెండర్ల‌లో అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవన్నారు. టెండర్‌ ‌పక్రియ చాలా పారదర్శకంగా జరుగుతుందన్నారు. కావాలనే కేటీఆర్‌, ‌హరీశ్‌ ‌రావులు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని  మంత్రి వివేక్‌ ‌మండిపడ్డారు. కొత్త మైన్స్ ‌వస్తేనే సింగరేణికి మనుగడ ఉంటుంది.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. త్వరలో రామకృష్ణపూర్‌ ‌లో కొత్త మైన్‌ ‌రాబోతుందని, ఆ ప్రాంతానికి ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *