కేటీఆర్‌కు కేసీఆర్‌ దీవెనలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: తన పుట్టిన రోజు సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తన తండ్రి, పార్టీ అధినేత కల్వకుర్తి చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. భార్య శైలిమ, పుత్రుడు హిమాన్షును తోడ్కొని ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న కేటీఆర్‌ తన తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా తన పుత్రుడిని ఆలింగనం చేసుకున్న కేసీఆర్‌ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు, నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కేసీఆర్‌, శోభమ్మలు ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *