వచ్చే వేసవికి ఉమ్మడి నల్గొండలో కృష్ణా ప్రాజెక్టులు పూర్తి

– ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యం
– తెలంగాణలో రికార్డ్ స్థాయిలో వరి ఉత్పత్తి
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట, ప్రజాతంత్ర, 18 : ఉమ్మడి నల్గొండ జిల్లాలో కృష్ణానది పై వున్న ప్రాజెక్టులన్ని వేగంగా పనులు పూర్తి చేసి వచ్చే వేసవి నాటికి అందుబాటులో తేవాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికార్ల‌కు సూచించారు.  బుధవారం మేళ్లచెరువు మై హోమ్ గెస్ట్ హౌస్ లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.  సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో నిర్మాణంలో ఉన్న రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్, తొండపాడు లిఫ్ట్ ఇరిగేషన్, రెడ్లకుంట లిఫ్ట్ ఇరిగేషన్, నక్కగూడెం గిఫ్ట్ ఇరిగేషన్, ముక్త్యాల బ్రాంచ్ లిఫ్ట్ ఇరిగేషన్, జాన్పాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్ని వచ్చే వేసవి నాటికి పూర్తిచేయాలన్నారు. అవసరమైతే 24 గంటలు పనులు నడిచే విధంగా చూడాలని, ప్రాజెక్టు, సైడ్ కాలువలకు కావలిసిన భూసేకరణ వేగవంతం చేయాలని, భూసేకరణ పూర్తయిన వాటికి వెంటనే డబ్బులు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ప్రాజెక్టులపై ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్లు కట్టాలో అక్కడ వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.ఎస్సారెస్పీ ఫేస్ -2 క్రింద ఉన్న ఆయకట్టు, ఎన్ఎస్పీ కింద ఉన్న పొలాలకు వారాబంది ప్రకారం నీటి సరఫరా చేయాలని, ఒక ఎకరం కూడ ఎండిపోకూడదని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో నాగార్జునసాగర్ వర్షాకాలం సీజన్ మూడుసార్లు నిండగా, అదే సీజన్లో రాష్ట్రంలో అత్యధికంగా వరి పండినదన్నారు.  అలాగే వరికి అత్యధిక మద్దతు ధర చెల్లించి చరిత్ర సృష్టించామని మంత్రి తెలిపారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కే నరసింహ, ఇరిగేషన్ శాఖ అధికారులు సి.ఇ, ఎస్సీ, హుజూర్నగర్ ఆర్డిఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *