26న ‘కోవెల’ 90వ పుట్టిన రోజు వేడుకలు

కాళోజీ జంక్షన్, ప్రజాతంత్ర, మార్చి 24: ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య 90 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందన సభను ఈ నెల 26న హనుమకొండ వడ్డెపల్లి పిఆర్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ఆచార్య సుప్రసన్నాచార్య నవతి పూర్తి అభినందన సభ కార్యదర్శి జి.గిరిజామనోహర్‌బాబు తెలిపారు. అభినందన సభ అధ్యక్షుడు, విశ్రాంతాచార్యులు బన్నా అయిలయ్య అధ్యక్షతన ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వెలుదండ నిత్యానందరావు పాల్గొని సుప్రసన్నపై ప్రచురించిన  ‘ప్రతిభ సుప్రసన్నం’ విశిష్ట సంచికను ఆవిష్కరించనున్నారు. విశిష్ట అతిథులుగా ప్రసన్న శారద పురస్కార గ్రహీత, ఢిల్లీ వెంకటేశ్వర కళాశాల ఆచార్యులు ఏల్చూరి మురళీధర్‌రావు, ప్రతిభ సుసంపన్నం ప్రధాన సంపాదకులు ఆచార్య డాక్టర్‌ ‌దహగాం సాంబమూర్తి తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *