– కాంగ్రెస్‌కు డిప్యూటీ మేయర్ పదవి
– ఎన్నికకు బీఆర్ఎస్ గైర్హాజరు
– ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఆర్ఆర్ఆర్, కూనంనేని
కొత్తగూడెం/ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్‌గా 20వ డివిజన్‌కు చెందిన సీపీఐ కార్పొరేటర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్‌గా 8వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ సిరిపురపు లలితా కుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నిక నిర్వహించారు. సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అధ్యక్షత వహించి కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 60 డివిజన్ల కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. సీపీఐకి చెందిన 22మంది, కాంగ్రెస్‌కి చెందిన 22మంది, బీజేపీకి చెందిన ఒకరు, సీపీఎంకి చెందిన ఒకరు, స్వతంత్రంగా గెలుపొందిన ఆరుగురు ప్రమాణ స్వీకారం చేశారు. బీఆరఎస్‌కి చెందిన 8మంది కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఎక్స్-అఫీషియో సభ్యులుగా సమావేశానికి హాజరైన స్థానిక శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు, ఖమ్మం పార్లమెంటు సభ్యుడు రామసహాయం రఘురాం రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
ఈ సందర్భంగా నూతన మేయర్ గణేష్ మాట్లాడుతూ 60 డివిజన్లలో సమానస్ఠాయిలో అభివృద్ధి సాధించేందుకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, ఇతర ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా పారదర్శక, బాధ్యతాయుత పాలన అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎక్స్-అఫీషియో సభ్యులు మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్పొరేషన్ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు అమోయ్ కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఐడీఓసి కార్యాలయం నుండి వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ సుజాత, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే