అభినందనలు తెలిపిన సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 21: జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల వరల్డ్ కప్ చెస్ పోటీల్లో భారత మహిళా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫైనల్‌కు చేరుకుంది. వరల్డ్ కప్‌లో సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి భారతీయురాలిగా ఘనత సాధించింది. ఈమేరకు ఆమెకు దేశ ప్రముఖులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఎక్స్ వేదికగా కోనేరు హంపికి అభినందనలు తెలిపారు. ’ఎఫ్‌ఐడీఈ ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌కు చేరిన గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి నా ప్రత్యేక అభినందనలు. ఈ లీగల్‌లో చేరిన తొలి భారతీయ మహిళ హంపి కావడం తెలుగు ప్రజలకు గర్వకారణం. ఆమె విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాన’ని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన ఫిడే మహిళల వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్‌లో కోనేరు హంపి 1.5`0.5 తేడాతో చైనాకు చెందిన యుక్సిస్ సాంగ్‌పై విజయం సాధించింది.



