– డిప్యూటీ సీఎం భట్టి, సమాచార మంత్రి పొంగులేటి సంతాపం\
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: పార్టీ సీనియర్ నాయకుడు, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, ఎన్‌ఎస్‌ఎస్ వార్తా ఏజెన్సీ వ్యవస్థాపకుడు కొండా లక్ష్మారెడ్డి ఆకస్మిక మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాసన సభ్యుడిగా, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా, జూబ్లీహిల్స్ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్‌గా లక్ష్మారెడ్డి సేవలు అందించారన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీలో లక్ష్మారెడ్డి పలు హోదాల్లో పని చేశారని ఉప ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గ్రీవెన్స్ సెల్ అధికార ప్రతినిధిగా సేవలందించారన్నారు. ఆయన మృతికి తీవ్ర సంతాపం తెలిపారు. అలాగే కొండా లక్ష్మారెడ్డి మృతిపై రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఎన్‌ఎస్‌ఎస్ వార్తా ఏజెన్సీ స్థాపకుడిగా, శాసన సభ్యుడిగా, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా, జూబ్లీహిల్స్ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్‌గా ఆయన సేవలందించారని కొనియాడారు. లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





